ఏక్ నాధ్ షిండే.. అజిత్ పవార్...బీజేపీ మాట వినాల్సిందే !
మహారాష్ట్రలో ఒకనాడు కేవలం యాభై సీట్లకు పరిమితం అయిన బీజేపీ ఈ రోజు 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరకు వచ్చేసింది.
బీజేపీ దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. ఎన్నిక ఎన్నికకూ గెలిచి వస్తోంది. దానికి కేవలం జనాదరణ ఒక్కటే కారణం కాదు బీజేపీ మార్క్ చాణక్య వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్రలో ఒకనాడు కేవలం యాభై సీట్లకు పరిమితం అయిన బీజేపీ ఈ రోజు 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరకు వచ్చేసింది.
ఈ మధ్యలో 2014లో శివసేనతో కటీఫ్ ఇచ్చి ఏకంగా 122 సీట్ల దాకా ఎగబాకింది. ఆ సమయంలో ఇతర మిత్రులను కలుపుకుని అయిదేళ్ళ పాటు దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేసి రాజ్యం చేసింది. దానికి కారణం ఆ పార్టీ మిత్రులను చేరదీస్తూ వారిని విడదీస్తూ వీలైతే చీలుస్తూ ఇలా అనేక రకాలైన రాజకీయ విన్యాసాలు చేస్తూ పోతోంది. దాంతో బీజేపీ ఆమాంతం ఎదుగుతూ అపర విక్రముడి అవతారం ఎత్తుతోంది.
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల తరువాత 105 సీట్లు బీజేపీకి వచ్చాయి. శివసేనతో పొత్తు ఉంది. అయినా శివసేనను మద్దతు పార్టీగా ఉండమంది సీఎం తనకే కావాలని స్పష్టం చేసింది. శివసేన కాదని వేరుపడిపోయింది. ఆ తరువాత రెండున్నరేళ్ల అపటు ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర సీఎం అయ్యారు. ఆ తరువాత శివసేను మొదట చీల్చి ఏక్ నాధ్ షిండేను సీఎం గా చేసింది. ఇక మరింత మద్దతు కోసం అజిత్ పవార్ ని కూడా తెచ్చింది.
అలా షిండే తన సొంత పార్టీ శివసేనను చీలిస్తే అజిత్ పవార్ సొంత బాబాయ్ శరద్ పవార్ పార్టీని చీల్చేశారు. అలా ఈ ఇద్దరూ అధికారంలో వాటా అందుకున్నారు. ఇక ఇపుడు ఈ ఇద్దరి పరిస్థితి ఏమిటి అన్నదే చర్చగా ఉంది. ఎందుకు అంటే బీజేపీ 2014లో 122 సీట్లు వచ్చినపుడే మరో 23 సీట్లను సాధించి సీఎం గా అయిదేళ్ళ పాటు సీట్లో కూర్చుంది. ఇపుడు మరో పది సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో బీజేపీకి సీఎం సీటు చాలా చేరువలో ఉంది.
అలా కాదని పేచీలకు దిగితే నష్టపోయేది ఏక్ నాథ్ షిండే. అజిత్ పవార్ లే అని అంటున్నారు. శివసేన ఐక్యంగా ఉన్నపుడే చీల్చిన బీజేపీకి ఇపుడు ఏక్ నాధ్ షిండే అజిత్ పవార్ ల పార్టీలను చీల్చడం ఒక లెక్క కాదని అంటున్నారు. పైగా కేంద్రంలో అధికారం ఉంది. అంతే కాదు బీజేపీకి అనేక రకాలైన వ్యూహాలు ఉన్నాయి. దాంతో ఏక్ నాధ్ షిండే అజిత్ పవార్ లు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలకు సిద్ధపడాల్సి ఉంటుందని అంటున్నారు.
మొత్తానికి చూస్తే బీజేపీ మార్క్ రాజకీయ వ్యూహంలో చిక్కి రెండు బలమైన పార్టీలు విలవిలలాడుతున్నాయనే అంటున్నారు. బీజేపీ రానున్న రోజులలో మహారాష్ట్రలో మరింతగా పాతుకుని పోతుందని అంటున్నారు. ఇక దేవేందర్ ఫడ్నవీస్ చాణక్య రాజకీయం చేస్తారని పేరు. ఆయనకు మోడీ అమిత్ షాల మద్దతు ఉంది.
ఒక్కసారి కనుక ఆయన సీఎం సీటు ఎక్కారూ అంటే సొంత మిత్ర పక్షాలకే కాదు విపక్షాలకు కూడ షాక్ ఇస్తారని అంటున్నారు. దాంతో బీజేపీకి ఇంతటి భారీ ఎత్తున సీట్లు దక్కడం మహా వికాస్ అఘాడీ కూటమికే కాదు మహాయుతి కూటమిలోనూ రాజకీయ అలజడి రేపుతోంది అని అంటున్నారు బీజేపీ చెప్పినట్లుగా ఎవరైనా వినాల్సిందే అన్న సీన్ అయితే మహ రాజకీయాల్లో ఉంది.