హర్షకుమార్.. రిలయన్సుతో వార్

Update: 2017-01-02 06:22 GMT
మాజీ  ఎంపీ హర్షకుమార్ మళ్లీ యాక్టివేట్ అవుతున్నారు.  సంచలన నిర్ణయాలతో లైమ్ లైట్ లోకి వచ్చేందుకు ట్రయ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన రిలయన్సు సంస్థపై కేసు పెట్టారు.  రిలయెన్స్ సంస్థలపై దొంగతనం, అక్రమం, క్రిమినల్ బ్రీచ్‌ ఆఫ్ ట్రస్ట్ తదితర నేరాల కింద కేసులు నమోదు చేయాలంటూ ఆయన అమలాపురం  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే చ ర్యలు తీసుకోకపోతే తాను కోర్టుకు కూడా వెళ్తానని చెప్పారు. కేజీ బేసిన్‌లో ఒఎన్‌జీసీకి చెందిన గ్యాస్‌ను భూగర్భం ద్వారానే రిలయన్స్ సంస్థ దోపిడి చేసిందని ఆయన ఆరోపించారు.  అమెరికాకు చెందిన సంస్థ ఇచ్చిన రిపోర్టులో ఈ విషయం నిర్దారణ అయిందని హర్షకుమార్ అన్నారు.
   
రిలయన్స్  దేశ చరిత్రలోనే అతిపెద్ద దోంగతనం చేసిందని... వారు చోరీ చేసి గ్యాస్ విలువ రూ. 11 వేల 5 కోట్లు అని చెప్పారు.  ఓఎన్‌జీసీలోపనిచేస్తున్న ఉన్నతాధికారులను రిలయన్స్‌ సంస్థ కొనుగోలు చేసి ఈ చోరీకి పాల్పడిందని హర్షకుమార్ ఆరోపించారు. రిలయన్స్‌ చేసిన దొంగతనం రుజువైన తర్వాత కూడా ప్రభుత్వాలు సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా… నిందితులైన పెద్దలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
   
పోలీసుల నుంచి పది రోజుల్లో సమాధానం రాకపోతే హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్తానన్నారు.  దొంగతనం చేసింది రిలయన్స్ కాబట్టి… ఏపీలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి హర్షకుమార్ పోలీసులు చర్యలు తీసుకుంటారన్న హర్ష కుమార్ ఆశలు తీరడం కష్టమే కాబట్టి ఆయన కోర్టుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే రిలయన్సుతో బిగ్ ఫైట్ కు హర్షకుమార్ రెడీ అవుతున్నట్లుగానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News