పురంధేశ్వరిని నమ్మాలా..గంటాను నమ్మాలా?

Update: 2018-07-15 09:48 GMT
ఏపీలో పడవ ప్రమాదాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మొన్నటికిమొన్న జరిగిన ప్రమాదాన్ని ఇంకా మర్చిపోకముందే మరోసారి గోదావరిలో ఏడుగురు గల్లంతయ్యారు. అయితే.. ఇందులో విద్యార్థులు ఉండడం.. వారు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లారని ప్రచారం జరుగుతోండడంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇదే విషయంపై నిలదీస్తున్నాయి. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పిల్లలను తీసుకెళ్లి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. వనం-మనం కార్యక్రమానికి వీరు వెళ్లారన్నది తప్పుడు ప్రచారమని అంటోంది.
    
కాగా బీజేపీ నేత పురంధేశ్వరి చంద్రబాబు ప్రభుత్వంపై ఈ విషయంలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకెళ్లిన స్కూల్‌ విద్యార్థులను తిరిగి క్షేమంగా ఇళ్లకు పంపాల్సిన బాధ్యత సర్కార్‌ ది కాదా అని పురందేశ్వరి ప్రశ్నించారు. రోశయ్య హయాంలో ప్రారంభమైన బ్రిడ్జి పనులు ఇప్పటికీ పూర్తికాక పోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తరచూ పడవ ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. పడవ ప్రమాదాలపై ప్రభుత్వం కమిటీ వేస్తుందే తప్ప ఒక్క నివేదిక కూడా బయటకు రాలేదని విమర్శించారు.
    
మరోవైపు  ప్రభుత్వ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. వనం-మనం కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ప్రమాదమని అసత్యప్రచారం అన్నారు. అయినా పడవ ప్రమాదంలో విద్యార్థులు చనిపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. విద్యార్థులు ప్రయాణించే పడవల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
Tags:    

Similar News