పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు కలకలం రేపాయి. పాక్ లోని వజీరాబాద్‌లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత ఫైసల్ ఖాన్ కూడా గాయపడ్డారు.
ఇద్దరు సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని గుంపు కొట్టి చంపింది. నిరసన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా గాయపడ్డారు.
మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధాని అయ్యాడు. అయితే అవినీతి ఆరోపణపై ప్రతిపక్ష శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారం నుండి తొలగించబడ్డారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది. వారి అనైతిక అధికారంపై ప్రజల్లోకి వెళ్లి ఇమ్రాన్ ఖాన్ నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి 'ప్రమాదం నుండి బయటపడింది' అని వైద్యులు చెప్పారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.