ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికి.. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు పలుకరించేందుకు నలుగురు కూడా ముందుకు రాని వైనం కనిపిస్తుంది. మీడియాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పలువురి చేత కీర్తింపులు పొందటమే కాదు.. రాజకీయ అధినేతల గుండెల్లో గుబులు రేపిన ఒకప్పటి టీవీ9 సీఈవో రవిప్రకాశ్.. కాలం చేతికి చిక్కి.. చంచల్ గూడ జైల్లో ఉండటం తెలిసిందే.
టీవీ9 ఛానల్ తో వచ్చిన పలుకుబడి కారణంగా కొన్నేళ్ల పాటు ఆయన ఎంతలా వెలిగిపోయారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడి సమాచారాన్ని తన వద్దకు తెప్పించుకున్న రవిప్రకాశ్.. తనను అరెస్ట్ చేస్తారన్న సమాచారాన్ని మాత్రం అందుకోలేకపోయారు. దీంతో.. ఆయన అరెస్ట్ కాక తప్పలేదు.
అక్రమ పద్ధతిలో నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ తప్పలేదు. ఈ నెల 9న బెయిల్ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందిస్తే సరేసరి. లేకుండా జైలు తప్పదు. జైల్లో ఉన్న రవిప్రకాశ్ ను రాజకీయ ప్రముఖులే కాదు.. మరే రంగానికి చెందిన ప్రముఖులు కూడా వచ్చి పలుకరించింది లేదు. ఉన్నంతలో తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఒక్కరే కాసేపు ఓదార్చి వెళ్లారని చెప్పాలి.
జైల్లో ములాఖత్ లో భాగంగా రవిప్రకాశ్ ను పలుకరించిన రేవంత్.. అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. అరెస్ట్ ఎందుకు అయ్యింది? దాని వెనుక ఏం జరిగిందన్న విషయం ఇద్దరికి తెలిసిందే. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అంత పెద్ద రవిప్రకాశ్ ను జైల్లో పెడితే.. రేవంత్ ఒక్కరు మాత్రమే పరామర్శకు రావటం గమనార్హం.