కిడారి హత్యకు ముందు వీడియో రిలీజ్

Update: 2018-09-25 10:00 GMT
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్య ఏపీలో కలకలం రేపింది. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ఆనవాళ్లు బయటపడడం.. పైగా ఓ ఎమ్మెల్యేనే చంపేయడంతో ఇది సంచలనమైంది.

తాజాగా ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేపట్టారు. కిడారిని చంపింది ఎవరు.? ఆ మావోయిస్టులు ఎక్కడి వారు.? ఆ దళం సంగతేంటనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఎమ్మెల్యే కిడారి డ్రైవర్ వాంగ్మూలంగా కీలకంగా మారింది. దాంతోపాటు ఎమ్మెల్యేతో పాటు వచ్చిన అనుచరులు తీసిన వీడియో ఇప్పుడు బలమైన సాక్ష్యంగా మారింది.

కిడారి హత్యకు ముందు ఎమ్మెల్యే కారును కొందరు మహిళా దళ సభ్యులు రౌండప్ చేశారు. కొందరు సాధారణ దుస్తుల్లో   ఉండగా.. కొందరు మావోల యూనిఫాం దుస్తుల్లో ఉన్నారు. యూనిఫాం వేసుకున్న వారి వద్ద తుపాకులున్నాయి. దాదాపు 10 మంది మహిళా మావోయిస్టులు ఎమ్మెల్యే కారును ఆపి ప్రశ్నిస్తున్నట్టు వీడియోలో ఉంది. దాదాపు 40 నుంచి 50 మంది చుట్టుపక్కల ఉన్నట్టు కనిపిస్తోంది.. వీరంతా 20 నుంచి 25 ఏళ్లలోపు వారేనని తేలింది. వీరంతా చత్తీస్ ఘడ్ - ఒడిశా భాష మాట్లాడారని గుర్తించారు.  దళ కమాండర్ గా ఓ మహిళ ఉన్నట్టు కిడారి డ్రైవర్ తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో మీడియాకు విడుదల కావడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో ఆధారంగా మావోయిస్టులను గుర్తించి కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News