మాజీ మంత్రి ఇంట్లో ఖ‌రీదైన కార్లు.. డ‌బ్బు, బంగారం

Update: 2021-09-17 12:30 GMT
ఆయ‌నో మాజీ మంత్రి.. అధికారంలో ఉన్న‌పుడు అక్ర‌మ మార్గంలో ఆస్తులు కూడ‌బెట్టార‌ని అవినీతికి పాల్ల‌డ్డార‌ని ప్ర‌త్య‌ర్ఙి పార్టీల నుంచి ఆరోప‌ణ‌లు ఫిర్యాదులు.. వాటి సంగ‌తేంటే చూద్దామ‌ని ఏసీబీ దాడులు చేసింది. అంతే క‌ళ్లు చెదిరే రీతిలో డ‌బ్బు, బంగారం, వ‌జ్రాలు, విలాస‌వంత‌మైన కార్లు, విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డ్డాయి. అవి చూసి ఏసీబీ అధికారులే ఆశ్చ‌ర్య‌పోయారు. ఇది జ‌రిగింది ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడులో. అన్నాడీఎంకే కీల‌క నేత‌, మాజీ మంత్రి కేసీ వీర‌మ‌ణి ఇంట్లో ఏసీపీ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేస్తే ఆయ‌న బండారం ఇలా బ‌య‌ట‌ప‌డింది.

అన్నాడీఎంకే ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా అయిదేళ్లు ప‌నిచేసిన వీర‌మ‌ణి.. ఎన్నో రెట్లు అధికంగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాణిజ్య‌, రిజిస్ట్రేష‌న్ శాఖ‌ల మంత్రిగా ప‌నిచేసియ ఆయ‌న అవినితీకి పాల్ప‌డ్డారని ఎంతో కాలంగా డీఎంకే నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ ఆరోప‌ణ‌ల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ ఏక‌కాలంలో దాడులు చేసింది. వీర‌మ‌ణితో పాటు ఆయ‌న బంధువులు బినామీలుగా భావిస్తున్న కొంద‌రి ఇళ్ల‌తో పాటు వాణిజ్య సంస్థ‌ల కార్యాల‌యాల్లోనూ త‌నిఖీలు చేప‌ట్టింది. చెన్నైతో పాటు వేలూరు, తిరుప‌త్తూరు, తిరువ‌ణ్ణామలై, బెంగ‌ళూరు  ఇలా మొత్తం 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించింది.

ఈ త‌నిఖీల్లో రోల్స్ రాయిస్ లాంటి 9 విలాస‌వంత‌మైన ఖ‌ర్లు 4.9 కేజీల బంగారు అభ‌ర‌ణాలు 7.2 కిలోల వెండి 47 గ్రాములు వజ్రాలు 34 ల‌క్ష‌ల న‌గ‌దు 1.8 ల‌క్ష‌ల విదేశీ క‌రెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల‌లో కోట్ల రూపాయాల విలువైన ఆస్తి ప‌త్రాల‌ను అధికారులు గుర్తించారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన ఏసీపీ అధికారులు మాజీ మంత్రి వీర‌మ‌ణిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

ఈ సంఘ‌ట‌న‌తో త‌మిళ‌నాడు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఈ విష‌యం ప్ర‌కంప‌ల‌ను సృష్టించే అవ‌కాశం ఉంది. జోలార్‌పేట‌లోని వీర‌మ‌ణి నివాస గృహంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్న‌పుడు వంద‌లాంది మంది అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆ ఇంటి ఎదుట ధ‌ర్మా నిర్వ‌హించారు. డీఎంకే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘ‌ట‌న‌పై అన్నాడీఎంకే నాయ‌కులు ఎలా స్పందిస్తారోనన్న ఆస‌క్తి మొద‌లైంది. మ‌రోవైపు సీఎం ప‌దవి చేప్ప‌ట్టిన‌ప్ప‌టి నుంచి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో సాగుతూ మంచి ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు ద‌క్కించుకున్న స్టాలిన్ ఈ విష‌యంపై ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి. 


Tags:    

Similar News