భవిష్యత్తులో మనుషులు నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన చోటుగా పేరున్న అంగారకుడిపై పరిశోధనలు జోరు అందుకుంటున్నాయి. ఇన్నాళ్లు నివాసం గురించే అక్కడి పరిస్థితులు అధ్యయనం చేస్తుండగా ఇపుడు పంటలు కూడా ఆ వరుసలో చేరాయి. అంగారకుడిపై అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆలుగడ్డలు పండిండొచ్చని ఓ అధ్యయనం చెప్తోంది. అంగారకుడిపై అత్యంత కఠిన వాతావరణంలో ఆలుగడ్డలను పండించవచ్చా లేదా కనుగొనేందుకు పెరూలోని అంతర్జాతీయ ఆలుగడ్డల కేంద్రం (సీఐపీ) ప్రయోగాలు ప్రారంభించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భూమిపైనా అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ పండించొచ్చని ఆ కేంద్రం చెప్తోంది. పెరూలోని ఇంజినీరింగ్ - టెక్నాలజీ వర్సిటీ పరిశోధకులు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేకంగా నిర్మించిన క్యూబ్ స్యాట్ అనే కంటెయినర్ లో దుంపలను నాటారు. అంగారకుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులే ఈ కంటెయినర్ లో ఉంటాయి. ఆ గ్రహంపై ఆలుగడ్డలు పెరిగితే, భూమిపై ప్రతికూల పరిస్థితుల్లో పండించే తీరు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందంటున్నారు.
మరోవైపు సూర్యుడికి - అంగారకుడికి మధ్య అతిపెద్ద అయస్కాంత కవచాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అరుణ గ్రహంపై ఒకప్పుడు ఉన్న వాతావరణాన్ని తిరిగి తీసుకురావచ్చని, భవిష్యత్తులో మనుషులు నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీలో ప్లానిటరీ సైన్స్ విజన్ -2050పై జరిగిన వర్క్ షాప్ లో ప్రతిపాదించారు. దీనిని సైన్స్ అలర్ట్ ప్రచురించింది. "ప్రస్తుతం అంగారక గ్రహంపై శీతల ఎడారి ఉంది. పైగా అయస్కాంత క్షేత్రం లేదు. శీతల ఉష్ణోగ్రత - పలుచని వాతావరణం కలిగి ఉండడంతో అరుణగ్రహం ఉపరితలంపై సుదీర్ఘకాలం ద్రవ రూపంలో నీరు ఉనికిలో ఉండడానికి అవకాశం లేదు. కానీ, ఎల్లప్పుడూ అలాగే ఉండకపోవచ్చు. ఒకప్పుడు అంగారకుడిపై ద్రవ రూపంలో నీరు - వెచ్చదనం - మానవులు నివసించడానికి అనువైన వాతావరణం ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు" అని విశ్లేషించింది. వందల కోట్ల ఏళ్ల క్రితం అయస్కాంత క్షేత్రం ధ్వంసం కావడంతో అరుణగ్రహంపై ప్రస్తుతం ఉన్న శీతల - శుష్క వాతావరణం ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే దాన్ని తిరిగి పునరుద్ధరించి మానవ నివాసానికి యోగ్యం చేసేందుకు కృషిచేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/