కరోనా కొత్త వేరియింట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని పొడిగిస్తూ.. నిర్ణణం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు.
డీజిసీఏ విడుదల చేసిన దాని ప్రకారం కొత్త నిషేధ ఆంక్షలు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అమలులో ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఉత్తర్వులు అంతర్జాతీయ కార్గో సేవలకు వర్తించదని అధికారులు తెలిపారు. విమాన రవాణా సేవలు గతంలో లానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. వీటిపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. కేవలం ప్రయాణికులు ఉన్న విమానాలకు మాత్రమే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు వివరించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పటికే భారత్ 27 కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో అధికారులు అప్రమత్తమ్యయారు. మందుగా అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలని భావించిన అప్పటికే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ విలయం సృష్టిస్తుండడం కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇప్పటికే భారత్ కొన్ని దేశాలను రెడ్ జాబితాలో చేర్చి ఉంది. ఈ దేశాలకు విమాన సేవలను నిలిపి వేసింది. ముఖ్యంగా కొత్త వేరియింట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలైన ఆఫ్రికాకు రెడ్ లిస్ట్లో పెట్టింది. వీటితో పాటు యూరప్ దేశాల పై కూడా ఇవే ఆంక్షలు కొనసాగుతాయని ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 23, 2020 న వివిధ దేశాలకు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపి వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఇప్పటికి ఒప్పంద ప్రాతిపదికన విమానాలను నడుపుతుంది. ఇదిలా ఉంటే వందే భారత్ మిషన్ లో భాగంగా కేవలం కొన్ని దేశాలకు సర్వీసులను నడుపుతుంది భారత్.
కరోనా వచ్చిన నాటి నుంచి భారత్ కేవలం విమానాల మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రయాణాల మీద కూడా ఆంక్షలు విధిస్తూ వచ్చింది. దీనిలో భాగంగానే స్వదేశీ విమానాలను ఆపేసింది. తొలి రోజుల్లో లాక్ డౌన్ విధించి.. అన్నీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. అయినా కూడా కరోనా విజృంభించింది. అయితే ఒమిక్రాన్ కూడా దేశంలో విస్తరించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు పొడిగిస్తూ వస్తోంది. కేంద్రం ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.