శ్రీశైలం అగ్నిప్రమాదం: ఆరు మృతదేహాల వెలికితీత

Update: 2020-08-21 10:50 GMT
శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 9 మందిలో ఆరుగురి మృతదేహాలను రెస్క్యూటీం తాజాగా గుర్తించింది. ఇంకా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గురువారం అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 9మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.

ప్రమాదం చిక్కుకున్న వారి కోసం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

పవర్ హౌస్ లో పనిచేస్తున్న ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని మధ్యాహ్నం గుర్తించారు. ఎంఆర్ విభాగంలో పనిచేస్తున్న సుందర్ నాయక్ తప్పించుకునేందుకు మెట్లు ఎక్కగా మంటలు ఎక్కువై ఆ మెట్లపైనే కుప్పకూలి మరణించాడు. ఆయన మృతదేహం 90శాతం కాలిపోయిందని రెస్క్యూ టీం తెలిపింది.

సుందర్ నాయక్ మృతదేహాన్ని వెలికితీసిన తరువాత మరో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీం బయటకు తీసింది. ఈ డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.




Tags:    

Similar News