ఫేస్‌ బుక్ వ్యాధికి కొత్త చికిత్స‌

Update: 2016-06-10 14:24 GMT
సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ఉప‌యోగించడం స‌ర‌దా నుంచి తీవ్రమైన వ్యసనంగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఓ ఫోటో లేదా పొస్టు పెట్టడం.. దానికి వచ్చే లైకులు - కామెంట్లు - షేరింగ్‌ లు చూసుకుని మురిసిపోవడం ప్ర‌స్తుతం చాలామందికి మామూలైపోయింది. అయితే ఈ లైకులు - కామెంట్లు - షేరింగ్‌ ల‌ మోజులో గంటలకు గంటలు ఫేస్ బుక్‌ లో గడిపేస్తున్నారు. మనదేశంలో ఇది వ్యసనంగా మారుతున్న వారు పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ - పాశ్చాత్య దేశాల్లో వీరి సంఖ్య లెక్కకు మిక్కిలిగా వుంది. ఇలాంటి వారి కోసం కొత్త చికిత్స తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఫేస్‌ బుక్ మితిమీరి ఉప‌యోగించ‌డం వ‌ల్ల వ్యక్తిగత జీవిత విశేషాలు కూడా ఫేస్ బుక్ గోడలమీద కనపడుతుండడంతో ఆయా దేశాల్లోని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ భయంకరమైన డ్రగ్ ను మించిన మత్తులా కమ్మేస్తోంది. వారిని ఆ మత్తుబారి నుంచి బయటపడేసేందుకు డీ అడిక్షన్ సెంటర్లు వెలుస్తున్నాయి. సాధారణంగా డీ అడిక్షన్ సెంటర్లంటే డ్రగ్ అడిక్షన్ కి గురైన వారిని మార్చే కేంద్రాలు. ఇది డ్రగ్స్ ను మించిన వ్యసనంగా మారుతుండడంతో దీనిని కూడా అక్కడ డీ అడిక్షన్ సెంటర్ అని సంబోధిస్తున్నారు. అల్జీరియాలోని కాన్ స్టాంటిన్ లో తాజాగా ఓ ప్రైవేటు డీ అడిక్షన్ సెంటర్ ను తెరిచారు. అందులో ఆల్కహాల్ - డ్రగ్ బాధితులతో పాటు ఫేస్ బుక్ బాధితులకు కూడా చికిత్స చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్ ను ఫేస్ బుక్ బాధితులు బాగా సంప్రది స్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News