పెరిగిన సాంకేతికత పుణ్యమా అని సమాచారం క్షణాల్లో అందరికి చేరిపోయే పరిస్థితి. ఒకందుకు ఇది మంచి పరిణామమమే అయినప్పటికీ.. అత్యుత్సాహంతో కొందరు చేస్తున్న పనులు.. నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా మారుస్తున్నాయి. కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టిస్తున్న పరిస్థితి.
తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయంలోనూ ఇలాంటి తప్పు చోటు చేసుకుంది. ఆయన షిల్లాంగ్ లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వేదిక మీద కుప్పకూలిపోవటం.. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించటం తెలిసిందే.
ఈ సందర్భంగా వేదిక మీద కలాం కూలిపోయిన ఉదంతానికి సంబంధించిన ఫోటో ఇదేనంటూ ఒక ఫోటో ప్రచారంలోకి వచ్చింది. పలు మీడియా సంస్థలు ఈ ఫోటోను వినియోగించారు.
అయితే.. ఈ ఫోటో తాజా ఘటనకు ఏ మాత్రం సంబంధం లేనిది. 2007లో ఒక అవార్డుల కార్యక్రమంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సందర్భంలో తీసిన ఫోటోను.. తాజా ఘటనగా పేర్కొంటూ సోషల్ మీడియాలోకి ప్రచారంలోకి రావటం.. దాన్ని అందరూ అదే ఫోటో అంటూ పలువురు షేర్ చేయటంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి ఒక తప్పు.. ఒప్పుగా ప్రచారంలోకి రావటం దురదృష్టకరం. కలాం మీద అభిమానం ఉన్న వారు ఇలాంటి ఫోటోల్ని షేర్ చేయకుండా ఉండటమే కాదు.. జరిగిన తప్పును నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉంది.