అంబానీ కోడలి రూ.451 కోట్ల నెక్లెస్.. కట్టు కథే ?

Update: 2023-06-09 11:43 GMT
ఆ కుటుంబంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సెలబ్రిటీలు రెక్కలు కట్టుకు వాలాల్సిందే. ఆ కుటుంబంలో మినీ గెట్‌ టుగెదర్‌ జరిగిన ప్రతిసారీ, సెలబ్రిటీలు వారింట్లోకి అడుగుపెట్టిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా అంబానీ కొడలీ నెక్లెస్ విషయంపై కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా లకు 2019 సంవత్సరంలో వివాహం అయిన సంగతి తెలిసిందే. ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా ఇటీవల ఇద్దరు పిల్లల తల్లి అయింది.  శ్లోకా మెహతా దేశంలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి రాసెల్ మెహతా కుమార్తె. అంబానీ, మెహతా కుటుంబానికి గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.

శ్లోకా తన విద్యను ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రారంభించారు. ఆకాష్ అంబానీ కూడా అక్కడే చదువుకున్నాడు. అక్కడి నుంచే వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మరింది. తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.  అయితే ఆమె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను కలిగి ఉన్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

అది ప్రపంచంలోనే అతిపెద్ద దోషరహిత వజ్రాన్ని కలిగి ఉంది. దీని విలువ రూ.450 కోట్లు. నివేదికల ప్రకారం.. ఈ నెక్లెస్‌ను లెబనీస్ నగల వ్యాపారి మౌవాద్ రూపొందించారు. శ్లోకా మెహతా పెళ్లి రోజున అంబానీలు ఈ నెక్లెస్‌ని బహుమతిగా ఇచ్చారు.  ఈ నెక్లెస్ లో దాదాపు 200 క్యారెట్ల విలువైన 91 వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఇది సింగిల్ పీస్.. దీని డిజైన్‌ను కాపీ చేయడం కూడా సాధ్యం కాదు అని అన్నారు.

అయితే ఈ నెక్లెస్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. తాజా నివేదికల ప్రకారం ఈ మాస్టర్ పీస్ మార్కెట్ లో అందుబాటులో లేవని చెబుతోంది. ఇక ఇటీవల అంబానీ కుటుంబంలోకి ఓ బుజ్జి యువరాణి వచ్చి చేరిందనె విషయం తెలిసిందే.

ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా జంటకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది.  కాగా 2019 మార్చిలో ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2020లో మొదటి బిడ్డ పృథ్వీని స్వాగతించారు.

Similar News