ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే.. టార్గెట్ చేసినట్లుగా.. కొత్త భయాందోళనల్ని పెంచేలా కొన్ని వీడియోలు కరోనా వైరస్ మాదిరి వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి వీడియోల్ని చూసిన కొందరు ద్వేషాన్ని పెంచుకోవటం ప్రమాకరమైన అంశంగా చెప్పాలి.
అసత్య వార్తలు.. సమాచారం.. వీడియోలు అదే పనిగా వైరల్ అవుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది. కరోనాకు సంబంధించిన అసత్య సమాచారానికి చెక్ పెట్టేందుకు వీలుగా కఠిన చర్యలకు తెర తీసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా factcheck. telangana. gov.in పేరుతో ఒక వెబ్ సైట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో.. సోషల్ వైరల్ అయ్యే పలు సమాచారానికి సంబంధించిన అసలు నిజాల్ని పేర్కొంటారు. దీని ద్వారా.. అసత్య సమాచార వ్యాప్తిని అడ్డుకునే వీలుంటుంది. తాజాగా కొన్ని వీడియోలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే.. అవన్నీ తప్పుడు వీడియోలు కావటం గమనార్హం. కొందరు ముస్లిం యువకులు స్పూన్లు.. ప్లేట్లు నాకుతున్నట్లుగా ఉన్న వీడియో 2018 నాటిది. ఆహారాన్ని వేస్ట్ చేయకుండా బోహ్రో ముస్లిం తెగలో ఇలా చేయటం ఒక అలవాటు. దాన్ని తప్పుగా ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చారు.
ఇటలీలో రోడ్ల మీద డబ్బులు పడేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లోనూ వాస్తవం లేదు. వెనిజులాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిన వేళ.. కరెన్సీ విలువ పడిపోవటంతో కొందరుఅలా చేశారు. కరోనా వేళ సోషల్ మీడియాలో సందేశాలు పంపేవారు శిక్షార్హులు అంటూ కేంద్ర హోం శాఖ పేరుతో ప్రచారంలో ఉన్న లేఖ జారీ కూడా అవాస్తవమే. లాక్ డౌన్ ను మే 4 వరకు పొడిగించినట్లుగా ప్రధాని మోడీ పేరుతో విడుదలై.. వైరల్ అవుతున్న ఫోటో కూడా మార్ఫింగ్ చేసినదే.
కొంతమంది ముస్లింలు జట్టుగా ఏర్పడి తుమ్ముతున్నట్లుగా ప్రచారం చేస్తున్న వీడియో వాస్తవం మరోలా ఉంది. దీనికి.. నిజాముద్దీన్ దర్గాకు ఎలాంటి లింకులేదు. సూఫీ ఆచారం ప్రకారం ఇలా ఊగిపోవటాన్ని జిక్ర్ అంటారు. పాకిస్థాన్ లో ఈ వీడియో జనవరిలో ప్రచారంలోకి వచ్చింది. ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి వాస్తవం ఏమిటన్నది చెప్పేందుకు వీలుగా ఈ వెబ్ సైట్ ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.