ఆయనేమీ సీఎం కాదు... లేదంటే దశాబ్దాలుగా రాజకీయాల్లో లేడు.. సినిమా హీరో కాడు, సినిమాళ్లో టీవీల్లో కనిపించి పాపులర్ కావడానికి.. అయినా ఆయన పేరు చెబితే జనం జై కొడతారు. అన్న అంటారు, మా బిడ్డ అంటారు.. ఈసరికే అర్థమైపోయి ఉంటుంది ఆయన జగన్ అని. జగన్.. వైఎస్ జగన్.. జగన్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి.. జగనన్న ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా అందులో జగన్ అన్న మాట మాత్రం ఉంటుంది. మరి అంతగా ప్రజలకు చేరువైన జగన్ నామాన్ని ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు. అస్సలు వద్దనుకోరు. జగన్ కూడా అదే చెప్తున్నారు. తాను పేరు మార్చుకున్నానంటూ మొదలైన ప్రచారం అంతా పుకారేనని చెప్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచనలు పంపినట్లుగానూ తెలుస్తోంది.
జగన్ తన పేరును మార్చుకుంటున్నారని.. వైఎస్సార్ తరహాలో జేఎంఆర్ అంటూ మూడు పొడి అక్షరాల్లో పిలిపించుకోవాలనుకుంటున్నారని పేర్కొంటూ కొన్ని పత్రికలు - చానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి పాదయాత్రకు ముందు ఇలాంటి పుకార్లు రావడంతోజగన్ వెంటనే స్పందించారట. తానేమీ పేరు మార్చుకోవడం లేదన్న విషయం వెంటనే ప్రకటించాలని పార్టీ అధికార ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం.
ఎక్కడ మొదలైందో ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ జగన్ పేరు మార్చుకుంటున్నారన్న ప్రచారం ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయింది. పాదయాత్రకు కొద్దిరోజుల ముందు ఇలా జరగడంతో జగన్ కూడా అప్ సెట్ అయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దురుద్దేశపూర్వకంగానే రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రచారానికి తెరతీశారని జగన్ అనుమానిస్తున్నట్లు చెప్తున్నారు. జగన్ అనే పేరు అంత పాపులర్ అయిన తరువాత ఇప్పుడు సడెన్ గా జేఎంఆర్ అన్నది ప్రచారంలోకి వస్తే నష్టం జరగడం ఖాయం. అందుకే పార్టీ కూడా వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చింది.