ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంను దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో మైనపు మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించారు.
2017లోగా మ్యూజియం దేశరాజధానిలో ఏర్పాటుచేయనున్నట్లు కామెరూన్ తెలిపారు.ఈ విషయాన్ని మ్యూజియం నిర్వాహకులు అయిన మెర్లిన్ సంస్థ సైతం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మ్యూజియం దేశవ్యాప్తంగా పేరున్న సినీ వేదికలయిన బాలివుడ్ - టాలీవుడ్ - కోలివుడ్ - శాండల్ వుడ్ ఇతర ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టించనుంది. రాబోయే పదేళ్ల కాలంలో దాదాపు 700 కోట్ల రూపాయలను ఈ మ్యూజియం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
లండన్ లోని టుస్సాడ్ మ్యూజియంలో మనదేశానికి చెందిన అనేక మంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యూజియం ఆ సెలబ్రిటీలు, ప్రముఖుల మైనపు విగ్రహాలు ఉంచిన చోటుగానే కాకుండా...ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ప్రఖ్యాతిగాంచింది.