బాలీవుడ్ నటి రవీనా టాండన్ కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన ఆమెకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. తనకు జరిగిన ఇబ్బందిని ట్విట్టర్ లో చెప్పుకున్న ఆమె.. జరిగిన దాని గురించి తెగ ఫీలైపోతున్నారు.
లాస్ ఏంజిలెస్ లో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆమె హాజరు కాగా.. వేదికపై తనతో ఉన్న ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్శించాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో సదరు వ్యక్తి బాగా డ్రింక్ చేసి ఉన్నాడని.. అతని పిల్లల్ని తన కారులో తీసుకురాలేదన్న అక్కసుతో ఆ వ్యక్తి అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతని పిల్లల్ని రవీనా కారులో తీసుకురావాలని ఎందుకు కోరుకున్నట్లు? అంటే.. సదరు వ్యక్తి రవీనాకు ముందే తెలుసా? అతని పిల్లల్ని కారులో తీసుకు వెళ్లాలని చెప్పేంత క్లోజ్ నెస్ ఆ వ్యక్తికి ఎలా వచ్చింది? లాంటి ప్రశ్నలు రాకుండా.. పూర్తి సమాచారం చెప్పని రవీనా.. ఆ వ్యక్తి వ్యవహారశైలిపై అక్కడి వారితో చెప్పటంతో అతన్ని దూరంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు.
సదరువ్యక్తి పిల్లల్ని కారులో తీసుకొచ్చేందుకు సెక్యూరిటీ.. ప్రోటోకాల్ ఒప్పుకోవని రవీనా పేర్కొన్నారు. సదరు వ్యక్తిని పక్కకు తీసుకెళ్లిన తర్వాత.. జరిగిన కార్యక్రమం అద్భుతంగా ఉన్నా.. తాను మాత్రం మూడ్ ఆఫ్ తో ఎంజాయ్ చేయలేదని పేర్కొన్నారు. ఇంతకీ అతను ఎవరు? అతనితో రవీనాకు ఉన్న పరిచయం ఏపాటిదన్న విషయాలు కూడా చెప్పేస్తే సరిపోతుందిగా..?