కేసీఆర్ కు భయం పట్టుకుందట.!

Update: 2021-06-20 07:22 GMT
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ కొట్లాట మొదలైంది. టీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలు హుజూరాబాద్ లో మోహరించిన వేళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ఈటలకు మద్దతుగా హుజూరాబాద్ కొచ్చారు. కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ రెండు పార్టీల రాజకీయం హుజూరాబాద్ లో వేడి పుట్టిస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ అన్నా.. కేసీఆర్ అన్నా ఒంటికాలిపై రెచ్చిపోయే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు మద్దతుగా పాల్గొన్న బండి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల దెబ్బకు కేసీఆర్ బయటకు వచ్చాడని బండిసంజయ్ ఆరోపించారు. జిల్లాల పర్యటనకు ఇదే కారణమన్నాడు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గడీలను బద్దలు కొట్టి బయటకు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈటెల దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు.

సీఎం నియంతృత్వ పాలనకు విసిగి టీఆర్ఎస్ నేతలు భారీగా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బండి తెలిపారు. దీంతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ముఠా దిగిందని.. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వారి ఆటలు సాగనివ్వమన్నారు.

పార్టీలకు అతీతంగా ఈటల అభివృద్ధిని ఆకాంక్షించారని బండి సంజయ్ ప్రశంసించారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆరోగ్యమంత్రి హోదాలో ఈటల నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరిగితే, సీఎం, మంత్రులు పట్టించుకోలేదని విమర్శించారు.
Tags:    

Similar News