కేటీఆర్ లెక్క‌!... ఫెడ‌ర‌ల్‌ కు 170 ఎంపీ సీట్లు!

Update: 2019-03-27 08:18 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొచ్చేశాయి. ఇప్ప‌టికే తొలి విడ‌త ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా... నామినేష‌న్ల ఘ‌ట్టం కూడా ముగిసిపోయింది. మ‌రో 15 రోజుల్లో తొలి విడ‌త స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ విడ‌త‌లోనే తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 ఎంపీ సీట్ల‌కు పోలింగ్ ముగియ‌నుంది. ఏపీలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నుండ‌గా... ఇటీవ‌లే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ముగించుకున్న తెలంగాణ‌లో కేవ‌లం లోక్ స‌భ స్థానాల‌కు మాత్ర‌మే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రంలో చ‌క్రం తిప్పేది ఫెడ‌ర‌ల్ ఫ్రంటేనంటూ... తెలంగాణ‌లోని అధికార పార్టీ టీఆర్ ఎస్ ఘంటాప‌థంగా చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో వ‌రుస‌గా రెండో సారి తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకున్న టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో అటు ఎన్డీఏతో పాటు ఇటు యూపీఏకు కూడా క్లియ‌ర్ మెజారిటీ రాద‌ని అంచ‌నా వేస్తున్న కేసీఆర్‌... టీఆర్ ఎస్ స‌హా ప‌లు ప్రాంతీయ పార్టీలు స‌త్తా చాటే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న కుమారుడు, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు కూడా మ‌రింత క్లారిటీగా చెబుతున్నారు. ఈ మేర‌కు ఓ జాతీయ వార్తా సంస్థ‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ చాలా ఆసక్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ దఫా కేంద్రంలో అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ... రెండు ప‌క్షాల‌కు కూడా అధికారం క‌ల్లేన‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఎన్డీఏ, యూపీఏల‌తో స‌మాన దూరం పాటిస్తున్న ప‌లు ప్రాంతీయ పార్టీల‌కు ఈ ద‌ఫా ఏకంగా 150 నుంచి 170 సీట్ల దాకా వ‌స్తాయ‌ని, దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే... ఈ పార్టీలే కీల‌క‌మ‌ని చెప్పారు. ఈ పార్టీల‌న్నీ ఓ ప్లాట్ ఫామ్ మీద‌కు వ‌స్తే... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దే అధికారం అని కూడా కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ ప్ర‌స్తావించిన అంశాల విష‌యానికి వ‌స్తే...

# ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట‌మికి 150 నుంచి 160 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయట‌.

# ఇక యూపీఏ కూటమికి ఈ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వమే ఎదురు కానుంద‌ట‌. ఈ కూట‌మికి గ‌తంలో కంటే కాస్తంత మెరుగైన రీతిలో 100 నుంచి 110 స్థానాల వ‌రకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయట‌.

# ఈ అంకెల‌తో అటు ఎన్డీఏతో పాటు ఇటు యూపీఏ కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సే లేదు.

# ఈ రెండు కూట‌ముల‌కు స‌మ దూరంలో ఉంటున్న ప‌లు ప్రాంతీయ పార్టీల‌కు ఏకంగా 150 నుంచి 170 సీట్ల దాకా వ‌చ్చే అవ‌కాశాలున్నాయట‌.

# ఈ జాబితాలో టీఆర్ ఎస్ తో పాటు మ‌జ్లిస్‌, ఏపీలోని వైసీపీ.. ఇంకా చాలా పార్టీలే ఉన్నాయ‌ట‌.

#  ఈ పార్టీల‌న్నీ క‌లిస్తే.... ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చున‌ట‌. కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా, చేయ‌లేకున్నా... ప్ర‌ధాని ఎవ‌ర‌న్న విష‌యాన్ని మాత్రం నిర్దేశిస్తుంద‌ట‌.

# మోదీ పాల‌న‌ను ఈ ఐదేళ్ల‌లో చూసిన జ‌నం... పెద్ద‌గా స‌మ్మోహితులేమీ కాలేద‌ట‌. ఫ‌లితంగా ఎన్డీఏ ఈ ఎన్నికల్లో పెద్ద‌గా రాణించే అవ‌కాశాలే లేవ‌ట‌.

# ఇక కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏకు కూడా ఈసారి అవ‌కాశం ద‌క్కే ఛాన్సే లేద‌ట‌. 2004 నుంచి 2014 దాకా దేశాన్ని పాలించిన యూపీఏ దేశానికి ఏం ఒర‌గ‌బెట్టింద‌న్న విషయాన్ని ప్ర‌జ‌లు గుర్తించార‌ని, ఫ‌లితంగా ఆ కూట‌మికి మ‌హా అంటే 110 సీట్లు కూడా ద‌క్క‌వ‌ట‌.

# ఈ రెండు కూట‌ముల‌కు దూరంగా ఉంటున్న త‌ట‌స్థ పార్టీలన్నీ క‌లిసి ఏకంగా 170 సీట్ల దాకా గెల‌వ‌చ్చున‌ట‌.

# ఎన్నిక‌ల త‌ర్వాత ఈ పార్టీల‌న్నీ ఒకే వేదిక మీద‌కు వ‌స్తే... ఎన్డీఏతో పాటు యూపీఏ జ‌మానాకు కూడా చ‌ర‌మ‌గీతం పాడేసిన‌ట్టేన‌ట.

# తెలంగాణ‌లోని టీఆర్ ఎస్ కు 16 సీట్లు ద‌క్క‌నుండ‌గా, మిగిలిన ఒక స్థానాన్ని మ‌జ్లిస్ గెలుచుకుంటుంద‌ట‌.

# ఇక ఏపీలోని విప‌క్షం ఈ ద‌ఫా సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌నుంద‌ట‌. రాష్ట్రంలో అధికార ప‌గ్గాల‌ను చేపట్ట‌నున్న ఆ పార్టీ ఏకంగా 15 నుంచి 22 లోక్ స‌భ సీట్ల‌ను గెలిచే అవ‌కాశం ఉంద‌ట‌.

# కేసీఆర్ పీఎం అయ్యే అవ‌కాశాలు ఉన్నా... దానిపై ఇప్పుడు టీఆర్ ఎస్ దృష్టి సారించ‌లేద‌ట‌. తొలుత త‌మ భావ‌జాలంతో స‌రిపోలే పార్టీల‌ను ఒక్క‌ద‌రికి చేర్చే ప‌నికి మాత్ర‌మే టీఆర్ ఎస్ ప్రాధాన్యం ఇవ్వ‌నుంద‌ట‌.

    
    
    

Tags:    

Similar News