దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కుల విషయంలో అమెరికాకు చెందిన హెల్త్ కేర్ సాప్ట్ వేర్ కంపెనీ ఎపిక్ సిస్టమ్స్ తాలూకా కేసులో విస్కాన్సిన్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు టీసీఎస్ కు 280 మిలియన్ డాలర్ల (2100 కోట్లు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై టీసీఎస్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది.
తాజాగా ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో కేవలం పరిహార రుసుము 140 మిలియన్ డాలర్లు (1049 కోట్లు) కట్టాలని తాజాగా తీర్పు చెప్పింది.
ఎపిక్ సిస్టమ్స్ అనుమతి లేకుండానే వారి సాఫ్ట్ వేర్ ను టీసీఎస్ ఉద్యోగులు ఉపయోగించారని.. టీసీఎస్ ఈ సాఫ్ట్ వేర్ ను హాస్పిటల్ మేనేజ్ మెంట్ సొల్యూషన్ మెడ్ ప్రాజెక్టులో వినియోగించిందని కోర్టులో నిర్ధారణ అయ్యింది.
దీంతో కోర్టు నిర్ధారించి టీసీఎస్ కు 1000 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పును చెప్పింది.