ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఒకరైన పాముల పుష్ప శ్రీవాణిపై మరోమారు కుల వివాదం మొదలైంది. ఎస్టీ కేటగిరీకి చెందిన పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొన్నటి 2019 ఎన్నికల్లోనూ ఆమె అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా... జగన్ సీఎం కాగానే ఆయన కేబినెట్ లో ఏకంగా గిరిజన కోటా కింద డిప్యూటీ సీఎంగా కూడా జాక్ పాట్ కొట్టేశారు. డిప్యూటీ సీఎం హోదాలోనే ఆమె గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని ఇప్పుడు ఆమె పుట్టిన జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు ఓ ఫిర్యాదు అందింది. ఏకంగా డిప్యూటీ సీఎం పైనే ఫిర్యాదు రావడంతో అది కూడా కుల వివాదానికి సంబంధించిన ఫిర్యాదు కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ఇక ఈ ఫిర్యాదు విషయానికి వస్తే... ఎస్సీ - ఎస్టీ ఉద్యోగుల సంఘం సలహాదారు రేగు మహేశ్ - అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్ లు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు ఈ ఫిర్యాదును అందజేశారు. ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గమైన కురుపాం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని - అయితే వాస్తవానికి ఆమె ఎస్టీ కాదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఎన్నికల అఫిడవిట్ లో పుష్ప పేర్కొన్నట్లుగా ఆమె కొండదేవర తెగకు చెందిన వారు కాదని వారు ఫిర్యాదు చేశారు. ఏకంగా డిప్యూటీ సీఎంగా ఉన్న నేతపైనే కుల వివాదం రేకెత్తేలా ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... ఈ పిర్యాదుపై రచ్చ జరగకముందే పుష్ప శ్రీవాణి చాలా వేగంగా స్పందించారు. తనపై రేకెత్తిన ఈ వివాదం కొత్తదేమీ కాదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన ఫిర్యాదు మాదిరే 2008లో కూడా తాను ఎస్టీని కాదని అదికారులకు ఫిర్యాదు అందిందని కూడా ఆమె గుర్తు చేశారు. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులే తనపై ఈ తరహా నిందలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... 2008లో వచ్చిన పిర్యాదును కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన ఫిర్యాదు కూడా వీగిపోవడం ఖాయమని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో ఏం తేలుతుందన్న విషయాన్ని పక్కనపెడితే... డిప్యూటీ సీఎం ఎస్టీ కాదంటూ జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు రావడం ఆసక్తిగా మారిపోయిందని చెప్పాలి.