తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలు అంటే.. వారు ప్రజాప్రతినిధులు అనేందుకన్నా వారిని వ్యాపారవేత్తలుగా సంబోధించడమే మేలని జనంలో ఉన్న ఒక అభిప్రాయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైనా నేతలు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. సర్వోన్నత పదవులను అధిష్టించారు. జాతీయ పార్టీలకు అధ్యక్షులు - ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన చరిత్ర తెలుగు ఎంపీలకు ఉంది! అలాంటి మహానుభావుల శకం ఎప్పుడో ముగిసింది.
ప్రత్యేకించి గత కొన్నేళ్లుగా ఎంపీలంటే వారంతా వ్యాపార వేత్తలు - పారిశ్రామిక వేత్తలు అనే పరిస్థితే కొనసాగుతూ ఉంది. ఇందులో పార్టీల నిమిత్తం లేదు. అన్ని పార్టీల్లోనూ అదే కథ. తమ తమ వ్యాపారాలను సజావుగా నడిపించుకునేందుకే చాలా మంది ఎంపీలుగా పోటీ చేస్తున్నారని - వీలైతే రాజ్యసభ సభ్యత్వం లేదంటే ఎంపీలుగా పోటీ చేయడం చాలా మంది మార్గం అవుతోందని స్పష్టం అవుతోంది.
ఇక ఇప్పుడు ఎన్నికల వేళ ఏపీ నుంచి ఎంపీలుగా బరిలో ఉన్న వారి జాబితాను పరిశీలిస్తే - ఆస్తుల పరంగా వారి లెక్కలను తీస్తే ఈ సారి కూడా వారిలో వందల కోటీశ్వరులకు లోటు ఏమీ లేదు!
-విజయవాడ నుంచి ఎంపీ గా బరిలో ఉన్న పీవీపీ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలకు పైనే ఉన్నాయి.
-నర్సాపురం నుంచి వైకాపా తరఫున పోటీ చేస్తున్న రఘురామకృష్ణం రాజు పేర్కొన్నకుటుంబ ఆస్తుల విలువ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు.
-గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ మొత్తం ఆస్తుల విలువ మూడువందల ఐదు కోట్ల రూపాయల చిల్లర.
-విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కుటుంబ ఆస్తుల విలువరెండు వందల ముప్పై కోట్ల రూపాయలు.
-స్థూలంగా అత్యధిక ఆస్తులను డిక్లేర్డ్ చేసిన ఎంపీ అభ్యర్థుల్లో ఐదు మంది తెలుగుదేశం వారు - ఐదు మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులున్నారు.
-ఇక ఇదే సమయంలో అత్యల్ప ఆస్తులను ప్రకటించిన టాప్ టెన్ జాబితా కూడా వెల్లడి అయ్యింది. దాని ప్రకారం ఆ జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందున్నారు.
-అరకు నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్న గొడ్డేటి మాధవి అత్యల్పంగా లక్షా నలభై వేల రూపాయల ఆస్తులను మాత్రమే తమ కుటుంబ ఆస్థిగా పేర్కొన్నారు.
-రాజంపేట నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న సయ్యద్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి పదిహేను లక్షల రూపాయలు.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం అభ్యర్థి గోరంట్ల మాధవ్ పదిహేడు లక్షల రూపాయల ఆస్తులను డిక్లేర్డ్ చేశారు.
-బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్ ఆస్థి ముప్పై మూడు లక్షలు.
-స్థూలంగా అత్యల్ప స్థాయి కలిగిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదు మంది ఉండగా - జనసేన వారు నలుగురు ఉన్నారు.
-కోటి రూపాయల కన్నా తక్కువ ఆస్తులున్న టీడీపీ అభ్యర్థులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో టాప్ టెన్ లో ఒకే ఒక టీడీపీ అభ్యర్థి ఉన్నారు!