21 ఏళ్ల కుర్రాడికి డెలివ‌రీలో పాప పుట్టింది

Update: 2017-07-09 12:59 GMT
మీరు విన్న‌ది నిజ‌మే. అందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. రాయ‌టంలో ఎలాంటి త‌ప్పులు దొర్ల‌లేదు కూడా. 21 ఏళ్ల కుర్రాడు పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చాడు. ఇంత‌కీ ఎక్క‌డ‌? అన్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. బ్రిట‌న్‌కు చెందిన 21 ఏళ్ల హేడెన్ క్రాస్ అనే కుర్రాడికి ముద్దులొలికే పాప పుట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అబ్బాయికి డెలివ‌రీ కావ‌టం ఏమిటి? ప‌్ర‌కృతి విరుద్ధ‌మైన ఈ ప‌ని ఎలా సాధ్య‌మైంద‌న్న విష‌యాల్లోకి వెళ్లాలంటే.. ముందుగా ప్లాష్ బ్యాక్‌కు వెళ్లాల్సిందే.

పుట్టుకతోనే హేడెన్ అమ్మాయి. అయితే.. అబ్బాయిగా మారిపోవాల‌న్న కోరిక బ‌లంగా ఉంది. దీంతో.. లింగ‌మార్పిడి చికిత్స చేయించుకోవాల‌ని డిసైడ్ అయ్యాడు. అమ్మాయి నుంచి అబ్బాయిలా మారిపోవాల‌నుకున్నాడు. మూడేళ్ల క్రితం నుంచి ఆమె కాస్తా అత‌డు అయ్యాడు. అంతేనా.. పురుషుడిగా మారేందుకు వీలుగా హార్మోన్ల‌ను మార్పిడి చికిత్స చేయించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే.. చికిత్స పూర్తి అయ్యాక బిడ్డ‌ల్ని క‌న‌టం కుద‌ర‌ద‌ని వైద్యులు తేల్చి చెప్పారు.

దీంతో.. బిడ్డ‌ల్ని క‌న‌లేని నేప‌థ్యంలో.. వెంట‌నే బిడ్డ‌ను క‌నాల‌నుకున్నాడు. అందుకు త‌గినట్లుగా వీర్యదానం చేసేందుకు సాయం కోసం ఫేస్ బుక్ లో కోరాడు. ఒక దాత ముందుకొచ్చేయ‌టంతో హేడెన్ గ‌ర్భం దాల్చాడు. జూన్ 16న గ్లోసెస్టేర్ రాయ‌ల్ ఆసుప‌త్రిలో హేడెన్ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాడు.  దీంతో తండ్రి అయినందుకు తెగ సంతోష‌ప‌డిపోయాడు. అదే స‌మ‌యంలో త‌ల్లి మాదిరి బిడ్డ‌ను క‌న్నందుకు అత‌గాడి(ఆమె) ఆనందం డ‌బుల్ అయ్యింది.

త‌న బుజ్జి కూతురికి పైగే అన్న పేరును పెట్టేశాడు. పురుషుడిగా మారిన త‌ర్వాత ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన తొలి రికార్డు హేడెన్ పేరు మీద లేకున్నా.. ఇలాంటి ఉదంతాలు చాలా.. చాలా అరుదుగా మాత్ర‌మే చోటు చేసుకుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News