కేబినెట్ కలలు.. జగన్ తీరుస్తాడా.?

Update: 2019-06-02 08:09 GMT
ఏపీ ఎన్నికల సమరంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా గోదావరి జిల్లాలు ఉంటాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో పశ్చిమ గోదావరిలో టీడీపీ మొత్తం సీట్లు గెలిచింది. తూర్పు గోదావరిలోనూ ఐదు సీట్లు తప్పితే అన్ని సీట్లు గెలిచింది. ఇలా టీడీపీ అధికారంలోకి రావడంలో 39 అసెంబ్లీ సీట్లున్న రెండు గోదావరి జిల్లాలు కీలకంగా మారాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడానికి ఈ రెండు జిల్లాలే దోహదం చేశాయి.

తూర్పు గోదావరి జిల్లాలో 2019 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 14 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలోని  మూడు పార్లమెంట్ స్థానాలను కూడా వైసీపీ గెలిచింది. మూడు పార్లమెంట్ లకు ఒక్కో మంత్రి పదవి చొప్పున తూర్పు గోదావరి జిల్లాకు మూడు మంత్రి పదవులు ఖాయమన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.

తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రధానంగా వైసీపీ నుంచి  కేబినెట్ రేసులో పిల్లి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, విశ్వరూప్, తాడివెట్టి రోజా, జ్యోతులలు ఉన్నారు. వైఎస్ఆర్, రోశయ్య కేబినెట్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్, రోశయ్య మంత్రులుగా పనిచేశారు. జగన్ వెంట  నాడు మంత్రి పదవికి - ఎమ్మెల్యే పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. జగన్ కోసం ఇంత త్యాగం చేసిన ఈయనకు ఖచ్చితంగా జగన్ మంత్రి పదవి ఇస్తాడని అంటున్నారు. అయితే మండపేట నుంచి పోటీచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. అయినా ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తారన్న టాక్ పార్టీలో నడుస్తోంది. ఎస్సీ కోటాలో అమలాపురం నుంచి గెలిచిన విశ్వరూప్ కు మంత్రి పదవి ఖాయమంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు మూడు మంత్రి పదవులు ఖాయమనుకుంటే పిల్లి, విశ్వరూప్ మినహాయిస్తే మిగిలిన ఒక్క సీటుకు ముగ్గురు పోటీపడుతుండడం ఆసక్తిగా మారింది. తాడిశెట్టి రాజా కాపు కోటలో మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. కాకినాడ రూరల్ లో గెలిచిన కన్నబాబు కూడా ఇదే కాపు కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నాడు. పైగా జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో ఈయనకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఇక జగ్గంపేట నుంచి గెలిచిన జ్యోతుల సత్తిబాబు కూడా కేబినెట్ రేసులో ముందున్నారు. ఇలా ముగ్గురు కాపులు మంత్రిపదవిపై కన్నేశారు. కానీ వైసీపీ ఒక్క మంత్రి పదవే కాపులకు ఇస్తామని వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉందట.. దీంతో పిల్లి - విశ్వరూప్ లకు తూర్పు గోదావరి జిల్లా నుంచి మంత్రి పదవులు ఇచ్చి.. కాపు కోటాను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భర్తీ చేస్తారని భావిస్తున్నారు.  ఈ పరిణామం మంత్రివర్గంపై ఆశలు పెంచుకున్న కాపు ఎమ్మెల్యేల్లో కలవరపాటుకు గురిచేస్తోంది.
Tags:    

Similar News