లాక్ డౌన్ నేపథ్యం లో దేశీయంగా విమాన ప్రయాణాలపై ఆంక్షల్ని విధించటం తెలిసిందే. ప్రస్తుతం మొదలైన లాక్ డౌన్ 3.0 ఈ నెల 17తో ముగియనుంది. మరి.. విమాన ప్రయాణాలు ఎప్పటి నుంచి స్టార్ట్ కానున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 18 నుంచి పరిమితంగా దేశీయంగా విమాన ప్రయాణాలు మొదలు కావొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇందుకు చాలానే పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18 నుంచి డొమెస్టిక్ విమాన ప్రయాణాలు మొదలవుతాయన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి పలు ఎయిర్ లైన్స్ కసరత్తు చేస్తున్నాయి.
మే 18 నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు మాత్రమే హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు నడుపుతాయంటున్నారు. తొలిదశలో శంషాబాద్ నుంచి ఢిల్లీ.. బెంగళూరు.. చెన్నై.. ముంబయి లాంటి ముఖ్య నగరాలకు మాత్రమే విమానాలు అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. అది కూడా విమానంలోని సీట్ల సామర్థ్యంలో కేవలం 33 శాతంతోనే విమానాల్ని నడుపుతారట.
సాధారణంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రోజువారీగా 60వేల మంది ప్రయాణిస్తుంటారు. నిత్యం 450 డొమెస్టిక్.. ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రాకపోకలు నిర్వహిస్తుంటాయి. కరోనా నేపథ్యంలో తొలుత దేశీయంగా విమాన రాకపోకలు మొదలవుతాయని.. ఆ తర్వాత విదేశీ సర్వీసుల్ని షురూ చేస్తారని చెబుతున్నారు.
మరో వారం నుంచి దేశీయంగా విమాన సర్వీసుల బుకింగ్ లు షురూ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో.. స్పైస్ జెట్.. గో ఎయిర్ తదితర సంస్థలు పెద్ద ఎత్తున సర్వీసుల్ని స్టార్ట్ చేస్తాయంటున్నారు. లాక్ డౌన్ తర్వాత విమాన సర్వీసులు షురూ అయిన వెంటనే ప్రయాణికులు.. ఎయిర్ పోర్టు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి.
చెకిన్ హాల్స్.. సెక్యురిటీ చెక్.. బోర్డింగ్ గేట్స్.. తదితర ప్రాంతాల్లో క్యూలైన్లు ఏర్పాటులోనూ కరోనా ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపించనుంది. కుర్చీల మధ్య సైతం ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల కోసం పలుచోట్ల సెన్సర్ ఆధారిత ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో క్యాష్ పేమెంట్స్ కంటే మొబైల్ వ్యాలెట్ లతో జరిపే కొనుగోళ్లకే ఎక్కువగా ప్రోత్సహిస్తారని చెబుతున్నారు. విమానంలోని 33 శాతం సీట్లకే బుకింగ్స్ ఇవ్వనున్న నేపథ్యంలో టికెట్ల ధరల మీదా ప్రభావం కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. అదే నిజమైతే.. విమాన ప్రయాణం మరింత ఖరీదెక్కటం ఖాయం.