ప్రయారిటీలు మారటం కొత్తేం కాదు. నిజానికి ఈ విశ్వంలో ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతల్ని ఇట్టే మార్చుకోవటంలో మనికి మారినంత త్వరగా మరెవరూ మారరేమో? తాజా ఉదంతాన్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. తనకు బాగా అవసరమైన వాటిని విడి రోజుల్లో పెద్దగా పట్టించుకోకున్నా.. అనూహ్య రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. అప్పటివరకూ పిచ్చ లైట్ తీసుకున్న వాటి కోసం మనిషి పడే తపన ఒక ఎత్తు అయితే.. అపురూపంగా మారిన ఆ వస్తువులు చేతికి చిక్కినప్పుడు పడే సంతోషాన్ని చూస్తే.. విస్మయానికి గురి చేయక మానదు.
కరోనా పుణ్యమా అని ఆ దేశం .. ఈ దేశం అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా మాస్కులకు.. శానిటైజర్లకు ఏర్పడిన కొరత అంతా ఇంతా కాదు. దీంతో వాటి కోసం ప్రజలు తపిస్తున్న తీరు మామూలుగా లేదు. మనకు పెద్దగా అలవాటు లేదు కానీ..బాత్రూంలో తప్పనిసరిగా వినియోగించే టాయిలెట్ పేపర్ రోల్ కోసం అమెరికన్లు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.
కరోనా వేళ.. వాటికి భారీ డిమాండ్ చోటు చేసుకుంది. విడి రోజుల్లో దాన్ని చాలా సింఫుల్ వస్తువుగా ఫీల్ అయ్యేవారంతా.. ఇప్పుడు ఒక రోల్ లభిస్తే చాలు.. అదేదో ఐఫోన్ లేటెస్ట్ మోడల్ మొదటిరోజే చేతికి వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇదంతా ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు అలాంటివి మరి. లాస్ ఏంజెలెస్ లో మహిళల గోల్ఫ్ లీగ్ పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఓవైపు కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుంటే.. ఈ పోటీలు ఏమిటన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. అన్ని జాగ్రత్తలు తీసుకొనే ఈ పోటీల్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.
అయితే.. ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్రైజ్ మనీతో పాటు.. టాయిలెట్ పేపర్ రోల్ బహుమతిగా ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ రోల్ ను ఇవ్వటాన్ని గొప్పగానే విజేతలు ఫీల్ అవుతున్నారే కానీ.. తక్కువ చేసినట్లుగా భావించట్లేదు. కాకుంటే.. టాయిలెట్ పేపర్ రోల్ బహుమతిగా చేయటంపై మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.