కంటికి కనిపించని కరోనా ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది. ఈ వైరస్ కారణంగా భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ కావాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో జనం ఎక్కడిక్కడ ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా ఇంతలా ప్రభావం చూపుతుందని కొద్ది రోజుల క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. కానీ , కరోనా దెబ్బకి దేశాలకి దేశాలే ... మూతబడ్డాయి. కాగా , భారత్ లో ఈ కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీనితో ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విదిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌తో 16,500 మంది ప్రాణాలు కోల్పోగా - బాధితుల సంఖ్య 3.76 లక్షలకు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492 కి చేరింది. వీరిలో 37 మంది ఇప్పటికే కరోనా నుండి కోలుకోగా , మిగిలిన వారు చికిత్స తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు భారత్ లో కరోనా వల్ల 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ..మరోసారి ఈ రోజు రాత్రి 8 కి జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కరోనాపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కరోనాపై యుద్ధంలో దేశ ప్రజలు సహకరించాల్సిందిగా కోరే అవకాశం ఉంది.
ఇకపోతే , కరోనా భాదితులని దేశంలో చాలా రాష్ట్రాలు .క్వారంటైన్ చేసాయి. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చినా కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే. అయితే , ఆలా కరోనా ఉందేమో అని అనుమానం ఉన్నవారికి , కరోనా భాదితులకు ప్రభుత్వం ఏ విధమైన ఫుడ్ ని అందిస్తుందో ఇప్పుడు చూద్దాం ..
ఉదయం : ఇడ్లీ - మినప వడ - పెసరదోస - గోధుమరవ్వ ఉప్మా - కాపీ - వాటర్ ని అందిస్తుంది. ( రోజుకొక ఐటమ్ మాత్రమే)
మధ్యాహ్నం : అన్నం - గుడ్డు - ఆకుకూరలు - అన్ని రకాల కూరగాయల కూర - సాంబారు - పెరుగు - అరటిపండు అందిస్తుంది.
స్నాక్స్ : వివిధ రకాల 100 గ్రాముల డ్రై ఫ్రూట్స్ - బత్తాయిలు - అరటి - ఆపిల్స్ - కాపీ ని అందిస్తుంది.
రాత్రి : అన్నం - గుడ్డు - పప్పు - రసం - పెరుగు -ఆకుకూరలు .