ఆ దేశంలో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి.. మాంసం ఎగుమ‌తులు బంద్!

Update: 2022-07-23 10:30 GMT
పుట్ అండ్ మౌత్ వ్యాధి ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా జంతు మాంసం (మేక‌లు, గొర్రెలు, పందులు, ప‌శువులు) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తోంద‌ని చెబుతున్నారు. ప‌శువుల పాదాలు, నోటికి వైర‌స్ సోకుతుంద‌ని.. అంటు వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. ఆ మాంసాన్ని ప్ర‌జ‌లు తీసుకున్న‌ప్పుడు వారికి కూడా అంటుకుంటోంద‌ని పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఇండోనేసియాలో పుట్ అండ్ మౌత్ వ్యాధి తీవ్రంగా ఉంద‌ని చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియాలోనూ వ్యాపిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ పుట్ అండ్ మౌత్ వ్యాధిలో ప‌శు ప‌రిశ్ర‌మ‌ల‌కు తీవ్ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయ‌ని, ముఖ్యంగా ప‌శు సంప‌ద (గొర్రెలు), మాంసం ఎగుమ‌తుల‌పై భారీగానే ఆధార‌ప‌డ్డ ఆస్ట్రేలియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఈ వ్యాధి న‌ష్టం చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు సోకే అంటువ్యాధి. ఇది అంటు వ్యాధి కావ‌డంతో ఇది సోకిన ప‌శువులు మ‌ర‌ణిస్తాయ‌ని అంటున్నారు.ఇది సోకిన జంతువుల మాంసం తిన్న‌వారికి జ్వరం, నాలుక పెదవులపై పుండ్లు, నోటిలో, చనుమొనలపై పొక్కుల వంటి పుండ్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అలాగే ప్ర‌జ‌ల‌కు బూట్లు, బట్టలు, సామాను ద్వారా కూడా వైర‌స్ వ్యాపిస్తుంద‌ని అంటున్నారు.

వైర‌స్ కణాలు మ‌నుషుల‌ ముక్కులలో 24 గంటల వరకు జీవించగలవ‌ని చెబుతున్నారు. ఈ వైరస్ కలుషిత మాంసం, ఇతర జంతు ఉత్పత్తుల ద్వారా కూడా వ్యాపిస్తుంది అని వివ‌రిస్తున్నారు. అలాగే చాలా వారాల పాటు ఈ వైర‌స్ వాతావరణంలో జీవించి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన పశువుల వ్యాధులలో ఒకటి అని అంటున్నారు. అలాగే ఏటాబిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగిస్తుంద‌ని చెబుతున్నారు.

ఈ వ్యాధి ఆసియాలోని అనేక ప్రాంతాలలో, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో వ్యాప్తి చెందడంపై ఆందోళన పెరుగుతోంది. ఇండోనేసియాకు విమాన ప్ర‌యాణాల‌ను నిషేధించాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వాన్ని అక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు కోరారు.

కాగా ప్రపంచ గొడ్డు మాంసం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా వాటా 4% మాత్రమే అయినప్పటికీ, ప్రపంచ ఎగుమతుల్లో 13% వాటా ఆ దేశానిదే. ఈ నేప‌థ్యంలో ఆయా దేశాలు ఆస్ట్రేలియా నుంచి మాంసం దిగుమ‌తుల‌పై నిషేధం విధిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి మాంసాన్ని దిగుమ‌తి చేసుకునే దేశాల్లో చైనా, జ‌పాన్, ద‌క్షిణ కొరియా ముఖ్య‌మైన‌వి. పుట్ అండ్ మౌత్ వ్యాధి విజృంభ‌ణ‌తో ఆ దేశాలు మాంసం దిగుమ‌తుల‌ను నిలిపేశాయి. అలాగే ప‌ర్యాట‌కులు కూడా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో ప‌ర్య‌టించ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.
Tags:    

Similar News