తరచూ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే అలవాటున్న ప్రధాని మోడీ.. కరోనా సెకండ్ వేవ్ లో తొలిసారి ఆయన తన సందేశాన్ని ప్రజలకు అందించారు. ఇరవై నిమిషాల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఆయన ప్రసంగంలో.. గతంలో మరెప్పుడూ లేని రీతిలో ఆయన తడబడటం షాకింగ్ గా మారింది. మోడీ వాగ్ధాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల కోసం వెతుకులాడటం.. తడబడటం లాంటివి ఆయన ఇంటా వంటా ఉండదు.
అలాంటి మోడీ.. తన తీరుకు భిన్నంగా తన ప్రసంగంలో నాలుగుసార్లు తడబడిన వైనం సరికొత్త మోడీని పరిచయం చేసేలా మారింది. చూస్తుంటే.. దేశం తాజాగా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి ఆయన్ను వెంటాడుతున్నట్లు ఉంది. దేశ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రసంగించిన ఆయన.. ఆ పని చేసే వేళలో మాట తడబడటం దేనికి నిదర్శనం అన్నది ప్రశ్నగా మారింది.
వేదిక ఏదైనా.. తన ప్రసంగం కోసం ఎదురుచూసే వారికి ఏ మాత్రం నిరాశకు గురి చేయకుండా మాట్లాడే సత్తా ఉన్న మోడీ.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో మాట తడబటం చూస్తే.. కరోనా తాజా పరిస్థితిపై ఆయన తీవ్ర ఒత్తిడితో ఉన్నారా? అన్న సందేహం కలుగుతోంది. ఏమైనా.. మోడీ లాంటి మహానేతను తడబడేలా చేసిన ఘనత కరోనాకు దక్కుతుందని చెప్పక తప్పదు.