చేటు చేస్తున్న మ‌ద్యం: ‌మూడు రోజులుగా ప‌ది మందికి పైగా మృతి

Update: 2020-05-09 15:31 GMT
క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా దాదాపు 40 రోజుల‌కు పైగా మ‌ద్యం దుకాణాలు మూసి ఉండ‌గా.. ప్ర‌జ‌లు మ‌ద్యం జోలికి పోలేదు. అయితే ఆదాయం లేక‌పోవ‌డంతో విధిలేక ప్ర‌భుత్వాలు మ‌ద్యం దుకాణాలు తెరిచాయి. దీంతో ప్ర‌జ‌లు మ‌ద్యం తాగేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ధ‌ర‌లు పెంచినా మ‌ద్యం తాగేస్తున్నారు. అయితే ఆ మ‌ద్యంతో దుష్ప్ర‌భావాలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ట్రాల్లో మ‌ద్యం ప్ర‌భావంతో నేరాలు పెరిగాయి. ఇన్నాళ్లు ప్ర‌శాంతంగా క్రైమ్ రేటు ఒక్క‌సారిగా పెరిగిపోయింది.

ఉదాహ‌ర‌ణ‌కు.. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా యాలాల‌లో రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఘోర సంఘ‌ట‌న‌లు చోటుచేసుక‌న్నాయి. ఒక‌రు మ‌ద్యం తాగి అతివేగంతో బైక్‌లు ఢీకొన‌డంతో ఒక‌రు మృతి చెంద‌గా.. ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇదే మండ‌లంలో మ‌ద్యం తాగొద్ద‌ని భ‌ర్త చెప్ప‌డంతో మ‌న‌స్తాపానికి గురైన భార్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఇక ఇదే జిల్లాలోని బొంరాస్‌పేట మండ‌లంలో క‌న్న‌త‌ల్లిని మ‌ద్యంమ‌త్తులో ఉన్న ఒక్క‌గానొక్క కుమారుడు హ‌త్య చేశాడు. ఎందుకంటే క‌రోనా భృతిగా ప్ర‌భుత్వం ఇస్తున్న డ‌బ్బుల‌ను త‌న తాగుడుకు ఇవ్వాల‌ని త‌ల్లితో గొడ‌వ‌ప‌డ్డాడు. భార్య‌తో కూడా గొడ‌వ‌ప‌డ‌గా ఆమె భ‌యంతో పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం మ‌ళ్లీ త‌ల్లితో గొడ‌వ‌ప‌డి కొద్దిసేప‌టికి త‌ల్లితో మ‌ద్యం తాగించి నిద్ర‌పుచ్చాడు. ఆ త‌ర్వాత మ‌ద్యంమ‌త్తులో త‌ల్లి గొంతు నులిమి హ‌త్య చేశాడు.

ఈ విధంగా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలు, హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లు సంభ‌విస్తున్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాలో కూడా రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. మ‌ద్యంమ‌త్తులో ప‌ర‌స్ప‌రం వాగ్వాద ప‌డ‌డం, దాడులు చేసుకోవ‌డం వంటివి జ‌రుగుతున్నాయి. ఈ విధంగా మ‌ద్యం ప్ర‌భావంతో ఇన్నాళ్లు ప్ర‌శాంతంగా ఉన్న క్రైమ్ రేటు క్ర‌మంగా పెరుగుతోంది. ఈ మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప‌ది మందికి పైగా చ‌నిపోయార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ప్ర‌శాంతంగా ఉన్న ఇళ్ల‌ల్లో మ‌ద్యం చిచ్చు పెడుతోంది. మ‌ద్యం దుష్ప్ర‌భావం చూపుతోంది. దీంతో మ‌హిళ‌లు మ‌ద్యం దుకాణాలు బంద్ చేయాల‌ని ఏపీలో కొన్నిచోట్ల ఆందోళ‌న చేశారు.

ఇక మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డంపై చాలామంది వ్య‌తిరేకిస్తున్నారు. ఇన్నాళ్లు క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ మ‌ద్యం దుకాణాల ప్రారంభంతో ఫెయిల‌వుతోంది. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. తాగిన మైకంలో కొంద‌రు రోడ్ల‌పై చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇన్నాళ్ల లాక్డౌన్ మ‌ద్యం దుకాణాల‌తో నిష్ఫ‌ల‌మ‌వుతోంద‌ని వైద్యులు ఆందోళ‌న చెందుతున్నారు. దీనిపై న్యాయ‌స్థానాల్లోనూ పిటిష‌న్లు వేశారు. ప్ర‌స్తుతం కోర్టులు విచార‌ణ సాగుతోంది.
Tags:    

Similar News