పెద్ద నోట్ల రద్దు మనవాళ్లనే కాదు విదేశీయులను కూడా నానా ఇబ్బందులు పెడుతోంది. మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన రెండు రోజుల్లోనే జరిగిన అలాంటి సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవా ఎయిర్ పోర్టులో ఈ నెల 10న ఒక విదేశీ మహిళ దిగారు. ఆ పర్యాటకురాలి వద్ద బ్యాగేజ్ ఎక్కువగా ఉండటంతో అదనంగా రూ. 1600 చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఆమె వద్ద రూ. 500, రూ. 1000 నోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో, ఆ డబ్బును తీసుకోవడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది నిరాకరించారు. చిల్లర కోసం ఎవర్ని అడిగినా లేదనే చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక... ఆమె కంటతడి పెట్టుకుంది. దీన్ని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి ఆమె వద్ద ఉన్న పాత నోట్లను తీసుకుని, కొత్త రూ. 2000 నోటు ఇచ్చాడు. దాంతో, ఆమె సమస్య పరిష్కారమైంది.
మోడీ నిర్ణయంతో ఫారెన్ టూరిస్టులకు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయడానికి ఇది మంచి ఉదాహరణ. ఇక్కడ కరెన్సీ గురించి పూర్తిగా తెలిసినవారు.. రోజురోజుకూ మారుతున్న నిబంధనలు గమనిస్తున్నవారు కూడా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సంగతులేవీ తెలియని విదేశీ టూరిస్టులు మరింత ఇబ్బందిపడుతున్నారు.
ఈ విషయాన్ని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ సలహాదారు సంజయ్ యాదవ్ వెలుగులోకి తెచ్చారు. విదేశీయులు కూడా నోట్ల కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పడానికే, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు. నోట్ల రద్దు మంచిదే కాని, ప్రజలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/