ప్రముఖులకు సంబంధించిన విషయాల్ని ఇష్టారాజ్యంగా రాసేసి.. సొమ్ము చేసుకుంటారన్న అపప్రద కొంతమందిలో ఉంటుంది. వాస్తవానికి.. అన్ని మీడియా సంస్థలు అదే తీరులో ఉండవు. నైతికత విషయంలో మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలో.. ప్రముఖులు సైతం అలానే ఉండాలి. ప్రముఖల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం తప్పంటూ లెక్చర్లు ఇచ్చే చాలామంది.. వారిని చూసి సమాజంలోని కొన్ని వర్గాల వారు అదే పనిగా ప్రభావితం అవుతుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఈ కారణంతోనే ప్రముఖులకు సంబంధించిన చాలా విషయాల్ని మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో కొన్నిసార్లు సంచలనం కోసం.. మరికొన్నిసార్లు పాఠకుల ఆసక్తి మేరకు వార్తలు ఇస్తుంటారు. తాజా ఉదంతంలోకి వస్తే.. ప్రముఖులు నైతికతను పాటించకుంటే ఎంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారన్న దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. టాంజానియా దేశానికి చెందిన మిస్ టాంజానియాగా ఎంపికైన బ్యూటీ క్వీన్ జాక్లీన్ చువా. 2008లో దేశ అందాల రాణిగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అమ్మడికి రెండు నెలల క్రితం లియోనిస్ నగసా అనే యువకుడ్ని పెళ్లాడింది.
ఇదిలా ఉంటే.. పెళ్లి జరిగి రెండు నెలలు మాత్రమే అయిన ఆమె.. వేరే వారితో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తించాడు సదరు భర్త. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే భర్తను మోసం చేస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయి ఆమెను కొట్టాడు.
భర్త దాడితో గాయాలైన ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాసేపటికి అమ్మడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే వేరే వారితో సంబంధం పెట్టుకుందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. భర్తపై చేసిన ఫిర్యాదుతో అతడు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.