మాజీ ఎంపీ.. ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేత.. దళిత నేతగా అందరికి సుపరిచితులైన హర్షకుమార్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇటీవల టీడీపీలో చేరిన ఆయన.. పార్టీ అధినేత తీరు విషయంలో సంతృప్తికరంగా లేనట్లు చెబుతున్నారు.
ఇటీవల అమలాపురం ఎంపీ టికెట్ ను ఆశించిన ఆయనకు చంద్రబాబు నిరాశకు గురి చేసినట్లుగా చెబుతారు. టీడీపీలో చేరిన ఆయన.. 2019 ఎన్నికల బరిలో నిలుస్తారని భావించారు. పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు కూడా. అయితే.. టికెట్ ఇచ్చేందుకు బాబు పాజిటివ్ గా లేకపోవటంతో ఆయనకు టికెట్ లభించలేదు.
తనను అదే పనిగా నిరాశకు గురి చేస్తున్న రాజకీయ పార్టీల తీరుతో విసిగిన ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్నికల తర్వాత ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో దళిత ఓటర్లు 68 లక్షల మంది ఉన్నారని.. వారిని ప్రాతినిధ్యం వహించే పార్టీ ఏదీ లేని నేపథ్యంలో.. ఆ లోటును భర్తీ చేసేందుకు వీలుగా దళిత పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త పార్టీ పెట్టే విషయమై ఇప్పటికే మందకృష్ణ మాదిగ.. తదితర దళిత నేతలతో ఆయన భేటీ అయ్యారని చెబుతన్నారు. ఏపీలోని రాజకీయ పార్టీలకు భిన్నమైన రీతిలో పార్టీని ఏర్పాటు చేయటం ద్వారా దళితుల్ని ఒక గొడుగు కిందకు తెచ్చే వీలుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్.. జనసేన అధినేతల మీద విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు తనను అవమానించాయని చెప్పిన హర్షకుమార్ టీడీపీతో తాను సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఓపక్క టికెట్ ఇవ్వని బాబుపై గుర్రుగా ఉంటూనే.. పైకి మాత్రం నవ్వుతున్న హర్షకుమార్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.