తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒళ్లు మండేలా మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు. కాల మహిమ కాకుంటే ఏంటి? ఎంత మాట పడితే అంత మాటను ఇట్టే అనేస్తున్నారు. ఒక టైంలో కేసీఆర్ ను ఉద్దేశించి ఒక్క మాట అనాలన్నా.. సవాలచ్చ ఆలోచించేవారు విపక్ష నేతలు. అందుకు భిన్నంగా మనసుకు ఏమనిపిస్తే.. ఆ మాటను అనేస్తున్న వైనం చూస్తే.. కేసీఆర్ అంటే భయం బొత్తిగా తగ్గిపోయిందనుకోవాలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ మార్పునకు కారణం బండి సంజయ్ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం మొదలు పెట్టిన నాటి నుంచి కేసీఆర్ ను ఉద్దేశించి మాట అనేందుకు సాహసం చేస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా.. తర్వాతి కాలంలో కాంగ్రెస్ లో చేరి.. మాజీ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి ఆయన..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడిన సందర్భంలో తాను టీఆర్ఎస్ పార్టీలో మళ్లీ చేరాలంటే.. టీఆర్ఎస్ నాయకత్వాన్ని మంత్రులు ఈటెల రాజేందర్ కు కానీ.. హరీశ్ కు కానీ అప్పజెప్పాలన్నారు. వారిద్దరూ తనకు ఇష్టమైన నేతలుగా చెప్పారు. వారిద్దరూ తక్కువ మాట్లాడతారు.. ఎక్కువ మాట్లాడతారన్న ఆయన.. కేసీఆర్.. కేటీఆర్ తప్పు కొని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇద్దరు నేతల్లో ఎవరికి అప్పజెప్పినా తాను టీఆర్ఎస్ లో చేరతానని చెప్పారు.
మంత్రి ఈటెలను కలిసి మాట్లాడాలని అనుకున్నానని.. అపాయింట్ మెంట్ కూడా అడిగాననని.. ఇప్పటివరకు ఆ అవకాశం ఇవ్వలేదంటూ.. ఈటెల మీద అనవసరమైన మరక పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. అంతేకాదు.. ఫోన్ ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ నేతలు తనతో మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. ఈటెల గొప్ప వామపక్ష వాది అని చెప్పిన ఆయన మరిన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.
కేసీఆర్ పై అప్పుడప్పుడు అలుగుతారని.. మరోసారి దోస్తీ చేస్తారంటూ లోగుట్టు విషయాన్ని ఓపెన్ చేసేశారు. ఆ విషయాల్ని తెలుసుకుందామనే భేటీకి ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈటెల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని జోస్యం చెప్పిన ఆయన.. ‘‘బీసీ.. ముదిరాజ్ లతో పార్టీ పెట్టమని ఈటెలను కేసీఆర్ ప్రోత్సహించే అవకాశం ఉంది. సొంత పార్టీ పెట్టే విషయంలో ఈటెల ఆలస్యం చేస్తే సీఎం కేసీఆర్ తో కలిసి డ్రామాలు ఆడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి కొండా టీఆర్ఎస్ పార్టీలోకి చేరాలంటే.. కేసీఆర్ ఒళ్లు మండే పరిణామాలతో పాటు.. పార్టీ మీద మొత్తం పట్టు పోవాలన్నట్లుగా ఉన్న మాటలు సంచలనంగా మారాయని చెప్పక తప్పదు. కొండా మాటలకు ఈటెల ఎలా రియాక్టు అవుతారో?