బ్యాట్ పట్టుకొని క్రీజ్‌లో నిలిస్తే చాలు స్కోర్ బోర్డుకు ఏదో పూనకం వచ్చినట్లుగా పరుగులు తీయించే సత్తా శ్రీలంక స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్య సొంతం. అత్యద్భుత బ్యాట్స్ మెన్ గా.. శ్రీలంక మాజీ కెప్టెన్ గా ఎన్నో విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితి తెలిస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి.
ఒకప్పుడు బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాట్స్ మెన్ గా నిలవటమే కాదు.. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీసే జయసూర్య ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న అతగాడు మోకాలి గాయం కారణంగా నడవలేకపోతున్నారు. స్ట్రెచర్స్ లేనిదే అడుగులు వేయలేని స్థితిలో ఉన్న ఆయన చికిత్స నిమిత్తం త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మెల్ బోర్న్ లో మోకాలి ఆపరేషన్ చేయించుకోనున్నట్లు చెబుతున్నారు.
సర్జరీ చేసిన తర్వాత దాదాపు నెల వరకూ నడవలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అప్పటివరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుందన్నారు. లంక క్రికెట్ లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఉన్న జయసూర్య.. తన కెరీర్లో ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నాడు. శ్రీలంక బోర్డు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా కొనసాగిన ఆయన తాజా పరిస్థితి ఇలా ఉండటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.