టీడీపీ మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయన మనవడు రెడ్డి గౌతమ్ చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి నిలువునా ముంచాడని ఆయనపై విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
విశాఖ జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనమడు అయిన గౌతమ్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన తాతతో కలిసి సచివాలయానికి వెళుతుండేవాడు. తరచూ అధికారులతో కలిసి పరిచయం పెంచుకున్నాడు. తన భార్య మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి అని.. చంద్రబాబు తనకు బాగా తెలుసు అని చెప్పుకుంటూ , బాబుతో దిగిన ఫొటోలు చూపిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. దీనికి అతడి భార్య ఎల్లంటి లోచిని కూడా సహకారం అందించింది..
తాత మంత్రిగా ఉండడంతో నిరుద్యోగులు సైతం నమ్మారు. దీంతో గౌతమ్ ఆ తర్వాత అమ్మ మ్యాన్ పవర్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడు. సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి తప్పుడు నియామక పత్రాలు అందించి నిరుద్యోగులను మోసం చేశాడు. దీంతో నిరుద్యోగులు విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు గౌతమ్ కు రిమాండ్ విధించింది.