సోషల్ మీడియా ను వాడు కోవడం లో మోడీ ని మించిన వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో లేరని అంటుంటారు! అయితే అది మరో కోణంలో కూడా అనే అర్ధమొచ్చేలా తాజాగా కొన్ని కామెంట్స్ తెర పైకి వచ్చాయి. మోడీ.. ట్విట్టర్ ని ఎలా బెదిరించారు.. ఎలాంటి ఇబ్బందులు పెట్టాలా ని భావించారు వంటి విషయాల ను తాజాగా ట్విట్టర్ మాజీ సీఈఓ తెలిపారు.
అవును... ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇదే సమయం లో ఈ వీడియో కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లు మరింత హాట్ టాపిక్ గా మారాయి.
రైతుల నిరసనలు, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాల ను బ్లాక్ చేయమ ని మోడీ ప్రభుత్వం ట్విట్టర్ పై ఒత్తిడి చేసిందని జాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయం లో చెప్పినట్లు వినని పక్షంలో... ట్విట్టర్ ఇండియా ఉద్యోగుల పై దాడి చేసి అరెస్టు చేస్తామని బెదిరించిందని డోర్సీ పేర్కొన్నారు. ఈ రూపం లో భారతదేశం నుండి అనేక అభ్యర్థనలు తమకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజాగా ఒక చర్చాకార్య క్రమంలో పాల్గొన్న ఆయన... ట్విట్టర్ కు భారతదేశం ఒక ముఖ్యమైన మార్కెట్ అని తెలిపారు. అయ్తిఏ చెప్పినట్లు వినకపోతే.. ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్ల పై దాడులు చేస్తామని, ఆ తర్వాత ట్విట్టర్ కార్యాలయాల ను మూసి వేస్తామని ప్రభుత్వం హెచ్చరించిందని ఆయన వెల్లడించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లోనే జరిగాయని జాక్ డొర్సీ ఉద్ఘాటించారు.
శక్తివంత మైన వ్యక్తుల నుండి వచ్చిన డిమాండ్ లను ఎలా పరిష్కరించారు అని అడిగినప్పుడు, డోర్సే ఈ ప్రకటనలు చేయడం గమనార్హం! మరి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు చేసిన ఈ కామెంట్స్ పై విపక్షాలు ఎలా స్పందించబోతున్నాయి.. మోడీ సర్కార్ ఎలా కవర్ చేసుకోబోతోంది అనేది వేచి చూడాలి.!