ఏపీ లో ప్రస్తుతం రాజధాని వ్యవహారం ఇంకా మండుతూనే ఉంది. గత నెల అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు రావచ్చు అంటూ చేసిన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనితో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అని, అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు గత 24 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం కూడా రాజధాని పై వేసిన కమిటీల నివేదికలని పరిశీలించి వేగంగా పరిపాలనా రాజధానిని విశాఖకి తరలించాలని ప్రయత్నాలు చేస్తుంది.
ఇకపోతే , తాజాగా మూడు రాజధానుల నిర్ణయం పై కేంద్ర మాజీ మంత్రి ,ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో కీలక పాత్ర పోషించని నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన సాధ్యమయ్యే విషయం కాదని అయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చోటే ఏపీ రాజధానికి అనుకూలమైన ప్రాంతమని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు వేర్వేరు చోట్ల ఉండడం కూడా సాధ్యం కాదని ఆయన తెలిపారు.
అంతేకాకుండా గతంలో మద్రాసు నుంచి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు 1953లో కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో గుంటూరు లో హైకోర్టు సాధ్యపడలేదని, అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటన్నది ఇంకా స్పష్టం చేయలేదు. విభజన సమయంలో ఏపీ రాజధాని పై అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా రాజధాని రాష్ట్రానికి మధ్య లో ఉండాలని సూచించినట్లు ఆయన చెప్పారు. మూడు రాజధానుల అంశం సాధ్యమవతుందని తాను అనుకోవడం లేదని జైరాం అభిప్రాయ పడ్డారు. ఉమ్మడి రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.