ఈ మధ్యన ఢిల్లీలోని బురారీ ఉదంతం గుర్తుంది కదా? బురారీ అన్నంతనే గుర్తుకు రాదేమో కానీ.. పదకొండు మంది కుటుంబ సభ్యులంతా అనుమానాస్పద రీతిలో మరణించిన ఉదంతం అన్నంతనే చప్పున గుర్తుకు వస్తుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని మర్చిపోక ముందే తాజాగా కేరళలో మరో వైనం వెలుగులోకి వచ్చింది.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేసి.. గొయ్యి తీసి పాతి పెట్టిన వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు చెబుతున్నా.. లభిస్తున్న ఆధారాలు చూస్తుంటే.. ఈ కుటుంబం మీద విపరీతమైన పగతో చంపేసినట్లుగా లభిస్తున్న ఆధారాల్ని చూస్తుంటే అర్థమవుతోంది.
కేరళ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఇడుక్కి జిల్లాలోని తొడుప్జు ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల్ని హత్య చేసి ఇంటి వెనుకే గొయ్యి తవ్వి నలగురినీ ఒకరిపై ఒకరిని పెట్టి పూడ్చేశారు.
ఈ ఇంటికి చెందిన వ్యక్తులెవరో నాలుగైదు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసుల దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు ఉండటం.. ఇంటి వెనుక ఒక చోట గొయ్యి తవ్విన దాఖలాలు కనిపించటంతో దాన్ని తవ్వగా ఈ దారుణం బయటకు వచ్చింది.
ఈ ఇంటి యజమాని చేతబడులు చేస్తుంటారన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీరి ఇంటికి రాత్రి వేళలలో పెద్ద ఎత్తున కార్లలో వచ్చి పోతుంటారని.. ఆయనకు రబ్బర్ ఫ్లాంట్ ఉందని చెబుతున్నారు. ఇంటి యజమాని కృష్ణన్ చేతబడి చేసిన కారణంగా నష్టపోయిన వారెవరూ పగతో కుటుంబం మొత్తాన్ని చంపేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో కానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.