ఆ దేశంలో ఇప్పటికి 160 మసీదులకు తాళాలు

Update: 2015-12-04 19:15 GMT
ప్యారిస్ లో తాజాగా చోటు చేసుకున్న ఉగ్రవాదుల మారణకాండతో.. ఆ దేశ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదుల పీచమణచటానికి అన్నివిధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్న ఫ్రాన్స్ దేశం.. తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దేశంలోని మసీదులపై కన్నేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం.. తాజాగా 160 మసీదులకు తాళాలు వేసి.. మూసేస్తున్నట్లు ప్రకటించింది.

ఉగ్రవాదులకు.. ఉగ్రవాద కార్యకలాపాలకు మసీదులు కూడా కారణమన్నది తాజాగా ఫ్రాన్స్ నిఘా వర్గాలు గుర్తించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాద సాహిత్యం ప్రింటింగ్ దగ్గర నుంచి పంపిణీ చేయటం వరకూ ప్యారిస్ మసీదుల్లో చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు నిర్ధరించటంతో మసీదుల్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇప్పటికే ప్యారిస్ లోని ముస్లింలను సందేహాంగా చూసే ధోరణి పెరుగుతున్న సమయంలోనే.. ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవటంతో ఆ దేశంలోని ముస్లింలతో పాటు.. ప్రపంచ దేశాల్లోని ముస్లింల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఫ్రాన్స్ సర్కారు మరెన్ని చర్యలు తీసుకుంటుందో..?
Tags:    

Similar News