ఫ్రీ అమెరికా వీసా..యువతకు కేఏ పాల్ బంపర్ ఆఫర్.. ఏం చేయాలంటే?

Update: 2022-09-20 16:47 GMT
తన పార్టీ గుర్తింపును రద్దు చేసిన భారత ఎన్నికల సంఘం (ఈసీ) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రబోధకుడు కేఏ పాల్ గుర్రుగా ఉన్నాడు. ఆ షాక్ నుంచి తేరుకునే పనిలో పడ్డారు. అయితే కేఏ పాల్ ఇంకా ఆశలు వదులుకోలేదు. పాల్ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ యాక్టివ్గానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాడు.

ఓటర్లను, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు కేఏ పాల్ బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చారు. ఈ వారాంతంలో కేఏ పాల్‌కి 59 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే అతను నిరుద్యోగ యువత కోసం వీసా ఫెయిర్‌ను నిర్వహించనున్నాడు. లక్కీ డ్రా నుంచి దాదాపు 59 మంది నిరుద్యోగ యువత ఎంపిక చేయస్తానని.. వారికి పాస్‌పోర్ట్ మరియు అమెరికా వీసా ఉచితంగా పొందడంలో సహాయం చేస్తామని కేఏ పాల్ ప్రకటించారు..

ఈ వీసా ఫెయిర్‌లో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కేఏ పాల్ వీడియో బైట్‌లో యువతకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని విమర్శలు చేశారు.

“నిరుద్యోగుల సమస్యలు నాకు తెలుసు. నిరుద్యోగుల నుంచి నేను ఏమీ ఆశించడం లేదు కానీ వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను’ అని కేఏ పాల్ వీడియోలో అన్నారు.

కేఏపాల్ తన ప్రకటనలో దేన్ని ఉద్దేశించి ఈ ప్రకటన చేశారో కానీ  ఈ పిలుపునకు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి యొక్క కల అమెరికాకి వెళ్లి డాలర్లలో సంపాదించడం. అదే సమయంలో ఈ ‘వీసా స్టంట్’ కనుక నిజమైతే పాల్ హీరో అవుతాడు.. లేదంటే ఏదో రాజకీయ కామెడీ కోసం అయితే అథోగతి పాలవుతాడు.  అతను ఇబ్బందుల్లో పడుతాడు. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి. .

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News