మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంస్థలు చాలానే ఆఫర్లు ఇచ్చేశాయి. పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే.. ముంబయికి చెందిన ఒక మహిళా సంఘం చేపట్టిన ఒక కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. మహిళా దినోత్సవం రోజున కొంతమంది మహిళలకు వారిస్తున్న తోఫా.. ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుందని చెప్పక తప్పదు.
ముంబయికి చెందిన శివశక్తి మహిళా అసోసియేషన్ ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థతో కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన వితంతు మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఏమిటంటే.. ఈ రోజు (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వితంతు మహిళలకు ఉచిత హెలికాఫ్టర్ రైడ్ ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్నిచేపట్టటానికి మరో కారణం ఏమిటంటే.. శివశక్తి మహిళా అసోసియేషన్ సేవలు అందించే ప్రాంతాలకు చెందిన నిరుపేద.. పేద.. మధ్యతరగతి మహిళలకు మరింత స్ఫూర్తిని కలిగించేందుకు.. ఈ రైడ్ ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఈ ఆలోచన బాగుందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.