‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి’ ఇది ముత్యాల ముగ్గు సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్. అలా ఈ ప్రపంచంలో చాలా మంది కళాపోషకులు ఉంటారు. వాళ్లు కేవలం ప్రకృతిని చూసి మాత్రమే ఆనందించరు. అంతకు మించిన ఆనందం కోరుకుంటారు. ఓ కళాఖండాన్ని చూసి మనసు పారేసుకుంటారు. అందుకోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు. ధనవంతుల్లోని కొందరు కళాపోషకులను బాగా ఆకర్షించేది పెయింటింగ్. ఈ పెయింటింగ్ అంటే ఆసక్తి ఉన్న ధనవంతులు ఎన్ని కోట్లు వెచ్చించి అయినా సరే ఈ పెయింటింగ్ ను కొనేస్తూ ఉంటారు.
ఇలాగే ఓ కళాపోషకుడు రూ. 400 కోట్లు వెచ్చించి ఓ పెయింటింగ్ ను కొన్నాడు. అంత ఖర్చు పెట్టడానికి కారణం ఏమిటి? అసలు ఆ పెయింటింగ్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచంలోనే అత్యంత విలువైన పెయింటింగ్ గా ఇది ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటీష్ పెయింటరైన సచా జాఫ్రీ దీనిని రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్యాస్ పెయింటింగ్ గా ఇది పేరొందింది. దీన్ని 17, 176 చదరపు అడుగుల మేర వేశాడట. చాలా పెద్దగా విస్తరించి ఉంది ఈ పెయింటింగ్.
దాదాపు 6 టెన్నిస్ కోర్టులంత విస్తీర్ణంలో ఈ పెయింటింగ్ విస్తరించి ఉందట.మొత్తం 70 భాగాలు విభజించి దుబాయ్ లో వేలం వేయగా రూ. 62 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ.450 కోట్లకు అమ్ముడు పోయింది. మనుషుల జీవన మనుగడను ఈ పెయింటింగ్ లో రూపొందించాడట చిత్రకారుడు జాఫ్రీ. దీన్ని జర్నీ ఆఫ్ హ్యుమానిటీగా పిలుస్తారు.ఈ పెయింటింగ్ ను గీసేందుకు 1065 పెయింటింగ్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింటింగ్ పట్టిందట. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌గా రికార్డులకు ఎక్కింది.