యువరాజు సినిమా చాలామంది చూసే ఉంటారు. కాస్త ఆ సినిమా స్టోరీకి దగ్గరగా ఉన్న కథ.. కాదు.. నిజం.. పారిస్ లో జరిగింది! ఒక వర్షం కురిసిన రాత్రి ఒక స్త్ర్రీ ఒక పురుషుడు కలుసుకున్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ రాత్రి ఏమి జరిగిందో తెలుసు కానీ.. దాని ఫలితం మాత్రం ఊహించలేదు. ఫలితంగా ఆమె తల్లి అయ్యింది.. అతడి అడ్రస్ పడిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా తన బాదను చెప్పుకుంటుంది. నా బిడ్డకు తండ్రీ... నువ్వు ఎక్కడున్నవ్ అని ప్రశ్నిస్తుంది. వీలైతే రమ్మని అభ్యర్ధిస్తుంది. కాస్త డిఫరెంట్ కా ఉన్న ఈ స్టోరీ సిడ్నీలో జరిగింది!
ఈ కథలో మన హీరోయిన్ పేరు నటాలీ అమ్యేత్.. ఆమె వయసు 26 ఏళ్లు. తల్లితండ్రులు లేరు.. పారిస్ లో ఒక్కత్తే ఉంటుంది. ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా టూరుకని వెళ్లింది. సరిగ్గా ఆ టూరు ముగించుకుని రేపు తిరిగి పారిస్ వెళ్లిపోతుంది అనగా.. ముందురోజు రాత్రి బీచ్ లో పరిచయం అయిన ఒక క్యూట్ బాయ్ తో ఒక హోటల్ గదిలో గడిపింది. అందమైన జంట.. ఆ అందమైన రాత్రి.. మరింత అందమైన అనుభవం పొందారు! ఆ రాత్రి అతడి ఫోన్ నెంబర్ కూడా ఈమె సేవ్ చేసుకుంది. ఉదయం అయ్యింది.. అప్పటికే ఆమె రిటన్ టిక్కెట్ బుక్ చేసుకుని ఉండటం వల్ల తిరిగి పారిస్ కి బయలుదేరివెళ్లిపోయింది. ఈ మద్యలో విది ఆడిన వింతనాటకంలో.. అతడి ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్న ఫోన్ ఎక్కడో పడిపోయింది! మూడు నెలల తర్వాత తెలిసింది ఆమెకు మూడో నెల అని!
ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ వేదికగా యూట్యూబ్, ఫేస్ బుక్ లలో తన వీడియో పోస్ట్ చేసింది. నా బిడ్డకు తండ్రీ నువ్వు ఎక్కడున్నావ్.. దయచేసి రా.. నన్ను భార్యగా స్వీకరించకపోయినా పర్లేదు కానీ నా బిడ్డకు తండ్రిగా మాత్రం ఉండు.. అని వేడుకుంటుంది. ఈ సమయంలో ఒక్క రాత్రి అనుభవంతో అతడి గుర్తులను కూడా చెబుతుంది అమ్యోత్! అతడి ఎత్తు 183 సెంటీ మీటర్లు, అందమైన జుట్టు, బంగారు రంగు చాయ, కోల ముఖ్యం.. ఇవి మాత్రమే ఆమెకు అతడి గురించి తెలిసిన విషయాలు. ఈ వీడియోను ఒక్క రోజులో లక్షల మంది చూశారు. ఈ వీడియో ఆ క్యూట్ బాయ్ కూడా చూస్తే... తనను గుర్తుపడతాడని ఈమె నమ్మకం! ఇది ఇంటర్వెల్ మాత్రం... సెకండ్ ఆఫ్ వేరే ఉంది!
బుదవారం ఫేస్ బుక్, యూట్యూబ్ లలో ఈమె వీడియో చూసిన వారికి మరో ట్విస్ట్! ఆమె "ఐ ఫౌండ్ హిం" అనే పెరుతో మరో వీడియో పొస్ట్ చేసింది. తాను వెతుకుతున్న క్యూట్ బాయ్ దొరికాడని చెప్పింది. ఆ సమయంలో ఆ వీడియోలో ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతడు పేరు ఆండీ సెల్లారు. సన్నీ కోస్ట్ సోషల్ మీడియా కంపెనీకి అతడు యజమానని, మొదటి వీడియోలో నటాలికా కనిపించిన ఆమెపేరు అలిజీ మిషెల్ అని చెబుతాడు. అంతేనా... ఇదంతా మార్కెటింగ్ కోసం చేసిన వీడియోనే తప్ప వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో వాళ్లు కలుసుకున్న మూలూలుబా బీచ్ ని ప్రచారం చేయడానికే ఈ పని చెశామని... ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయని ట్విస్ట్ ఇవ్వడంతో శుభం కార్డు పడింది!