గసగసాల మొక్కలతో డ్రగ్స్​.. ఏపీలో కొత్త దందా?

Update: 2021-03-16 14:30 GMT
మామూలుగా గసగసాలను వంటల్లో ఉపయోగిస్తాం. ఎక్కడైనా గసగసాల మొక్కలు సాగు చేస్తే అవి మసాలా దినుసులు కాబట్టి వాటిని సాగుచేస్తున్నారేమో అనుకుంటాం. కానీ గసగసాల చెట్లకు కాయలు కాస్తాయి.. ఆ కాయల నుంచి జిగురును సేకరించి దాన్ని హెరాయిన్​, కొకైన్​ లాంటి మత్తు పదార్థాల్లో వాడతారు. తాజాగా ఏపీలో డ్రగ్స్​ కోసం గసగసలా పంట సాగు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ గసగసాల సాగు వెనక భారీ డ్రగ్​ మాఫియా ఉన్నట్టు ఏపీ ఎక్సైజ్​ అధికారులు తేల్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు సమీప కరబలాకోట మండలంలో చాలా ఏళ్లుగా ఈ గసగసల పంటను సాగు చేస్తున్నట్టు సమాచారం.

బెంగళూరుకు చెందిన ఓ ముఠా ఈ దందాను సాగిస్తున్నట్టు ఎక్సైజ్​ పోలీసుల విచారణలో తేలింది. ఈ గసగసాల సాగును ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దీని వెనక ఎంత పెద్ద ముఠా ఉంది.. తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.మదనపల్లె ప్రాంతంలో మామిడి తోటలు, అల్లనేరేడు, మొక్కజొన్న, టమోటా పంట మధ్యలో గసగసాలను అంతరపంటగా సాగుచేస్తున్నట్టు సమాచారం.
ఈ దందా వెనక అంతర్జాతీయ డ్రగ్స్​ మాఫియా హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఓపీఎం పోపీ అనే పేరుతో పిలిచే గసగసాలను ఇక్కడ సాగుచేస్తున్నట్టు సమాచారం.


కర్ణాటకలోని కోలారు జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈ దందా సాగుతున్నట్టు సమాచారం. దాదాపు ఆరేళ్లుగా ఈ దందా యథేచ్చగా సాగుతుండగా ఇప్పుడు బయటపడింది.

అయితే కాయలు పక్వానికి రాగానే మాఫియా ముఠా వచ్చి వాటిని తెంపుకొని వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కాయలను డ్రగ్స్​లో వాడతారని తమకు తెలియదని రైతులు అంటున్నారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే ముగ్గురు రైతులపై కేసులు నమోదు చేశారు. వాళ్లపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెన్స్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదయ్యాయి.


గసగసాలు సాగుచేయడానికి మనదేశంలో అనుమతి లేదు. వాటిని కేవలం కొన్ని ఔషధాల్లో వాడతారు.

కేంద్ర ఔషధ తయారీ సంస్థ అనుమతితో మాత్రమే గసగసాలను తయారుచేయవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున సాగవుతోంది.

చిత్తూరు జిల్లా మదనపల్లె, చౌడేపల్లి, పుంగనూరు మండలాల్లో కర్ణాటకలోని కోలారు, బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బెంగళూరుకు చెందిన ఓ ముఠా రైతులకు విత్తనాలను సరఫరా చేస్తుంది. అనంతరం కాయలను సేకరించి వాటి బెరడు నుంచి జిగురును తీసి వాటితో డ్రగ్స్​ తయారుచేస్తున్నారు. దీన్ని బెంగళూరుకు పంపిస్తున్నారు.


Tags:    

Similar News