కాలం ఎంత వేగంగా మారిపోతుందో అన్నట్లుగా క్యాలెండర్లో మరో కొత్త నెల మొదలైంది. నిన్ననో.. మొన్ననో కొత్త సంవత్సరం వచ్చినట్లుగా అనిపించినంతనే.. అప్పుడే ఏడాదిలో నాలుగు నెలలు పూర్తి అయి.. ఐదో నెల వచ్చేసింది. ఎప్పటిలానే ప్రతి నెల చివరిలోనూ.. మధ్యలోనూ పెట్రోల్.. డీజిల్ ధరల్ని సమీక్షించి.. హెచ్చ తగ్గుల ఆధారంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని డిసైడ్ చేయటం తెలిసిందే.
అయితే.. ఈసారి దీనికి మరో అంశం కొత్తగా యాడ్ కానుంది. దేశ వ్యాప్తంగా ఐదు పట్టణాల్లో.. అంతర్జాతీయ ధరల ఆధారంగా ఏ రోజుకు ఆ రోజు ధరల్ని డిసైడ్ చేసే కొత్త విదానాన్ని తెర మీదకు తీసుకురానున్నారు. ఈ కొత్త విధానాన్ని ఈ ఐదు నగరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి.. దీని ఫలితాల ఆధారంగా దేశ వ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ కొత్త విధానంలో దక్షిణ భారతంలో పుదుచ్చేరి.. విశాఖపట్నం.. పశ్చిమాన ఉదయ్ పూర్.. తూర్పున జంషడ్ పూర్.. ఉత్తరాదిన చండీగఢ్ పట్టణాల్లో ఈ రోజు నుంచి పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఏ రోజుకు ఆ రోజు డిసైడ్ చేయనున్నారు. తాజా మార్పుల నేపథ్యంలో సోమవారం ఈ ఐదు నగరాల్లో పెట్రోల్ ధరల్ని ఐవోసీ ప్రకటించింది.
లీటరు పెట్రోల్ ఐదు నగరాల్లో ఎలా ఉందంటే..
+ చండీగఢ్ రూ.67.65
+ జంషెడ్ పూర్ రూ.69.33
+ పుదుచ్చేరి రూ.66.02
+ ఉదయపూర్ రూ.70.57
+ వైజాగ్ రూ.72.68
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ చివరి రోజు అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని సమీక్షించిన ఆయిల్ కార్పొరేషన్ ధరల్ని ప్రకటించారు. పెట్రోల్ పై ఒక పైస.. డీజిల్ పై 44 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మారిన ధరల్ని సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/