కరోనా ఎఫెక్ట్: నాటుకోడికి ఫుల్ డిమాండ్

Update: 2020-08-08 00:30 GMT
కరోనా ప్రబలిన కొత్తలో కోళ్ల ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుందని వదంతలు రావడంతో కోడి మాంసం ఎవరూ తినక ఫ్రీగా ఫారాల వారు కోళ్లను పంచిన పరిస్థితి చూశాం. ఇక సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పగానే చికెన్ కు రేటు పెరిగి ఇప్పుడు కిలో రూ.300కు చేరింది.

అయితే ఇప్పుడు పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్లలో కరోనా తీవ్రత తక్కువగా ఉంది. కారణం ప్రజల ఆహార అలవాట్లేనని స్పష్టమైంది. పట్టణాల్లో దొరికే బ్రాయిలర్ కోడిమాంసం (చికెన్) కంటే పల్లెటూళ్లో దొరికే నాటుకోడిలో పోషకాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. రుచితోపాటు ప్రొటీన్ అధికంగా ఇందులో ఉంటుంది. అందుకే ఇప్పుడు నాటుకోడికి డిమాండ్ ఎక్కువైంది.

డిమాండ్ ఎక్కువై సప్లై తక్కువ కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో నాటు కోడి మాంసం ఏకంగా రూ.500 పలుకుతోంది. సాధారణ చికెన్ కు రెండు రెట్లు ధర ఉంది.

ఇక నల్లగా ఉండే కడక్ నాథ్ కోళ్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని కిలోకు రూ.800కు అమ్ముతున్నారు.డిమాండ్ పెరగడంతో ప్రత్యేక ఫారాల్లో నాటు కోళ్లను పెంచుతున్నారు.


Tags:    

Similar News