హాట్ టాపిక్: గాలి వారింట పెళ్లి పిలుపు అదిరింది

Update: 2016-10-19 07:12 GMT
డబ్బులున్న మా రాజులు తమ ఇంట్లో జరిగే వేడుకల్ని ఏ రేంజ్లో చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. దశాబ్దాల క్రితమే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తనకు పెంపుడు కుమారుడు పెళ్లి కోసం పెట్టిన ఖర్చు వందల కోట్లల్లో ఉండటమే కాదు.. దేశం యావత్తు ఈ పెళ్లి గురించి చెప్పుకుంది.ఆ పెళ్లి వైభవం ఆ తర్వాత అమ్మను ఎంతగా ఇబ్బంది పెట్టిందన్నది అది వేరే లెక్క అనుకోండి.

సామాన్యుడు సైతం తమ ఇంట జరిగే పెళ్లిని వీలైనంత ఘనంగా చేయాలని భావిస్తారు. అలాంటిది అపర కుబేరుల్లాంటి వారింట పెళ్లి జరుగుతుంటే ఆ హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి ఏర్పాట్లు మొదలు.. పెళ్లికి వచ్చే అతిధులకు చేసే ఏర్పాట్లు పెద్ద పెద్ద వార్తలుగా రావటం చూశాం. కానీ.. వారందరికి మించిన విధంగా మైనింగ్ మహారాజ్ గా పేరున్న వివాదాస్పద వ్యాపారవేత్త కమ్ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఇంట జరుగుతున్న పెళ్లి వ్యవహారం.. శుభలేఖ నుంచే సంచలనంగా మారిన పరిస్థితి.

గాలి జనార్దనరెడ్డి కుమార్తె  బ్రహ్మణి పెళ్లి రాజీవ్ రెడ్డితో వచ్చే నెలలో జరగనుంది. గత నెలలో ఈ పెళ్లికి ముందస్తుగా నిశ్చితార్థం పూర్తి అయ్యింది. ఆ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేసిన గాలి జనార్దనరెడ్డి.. తాజాగా తన పెళ్లికి సంబంధించిన శుభలేఖ ముచ్చట బయటకు వచ్చింది. పెళ్లి కార్యక్రమం.. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయటం చూశాం కానీ.. ఆ రిచ్ నెస్ ను శుభలేఖలోనే చూపించారు. రిచ్ నెస్ తో పాటు.. అదిరిపోయే క్రియేటివిటీతో ఇప్పుడు అందరి దృష్టి పడేలా చేశారు గాలి జనార్దనరెడ్డి.

ఖరీదైన జ్యూయలరీ బాక్స్ లో పెళ్లి శుభలేఖను సిద్దం చేశారు. బాక్స్ తెరిచిన వెంటనే ఈ శుభలేఖ ఎల్ సీడీ మానిటర్ మీద దర్శనమిస్తోంది. దాదాపు నిమిషం పది సెకండ్ల పైనే ఉన్న ఈ శుభలేఖలో గాలి జనార్దనరెడ్డి..ఆయన సతీమణి.. పెళ్లి కుమార్తె.. పెళ్లి కొడుకును పరిచయం చేయటం.. పెళ్లి తేదీని.. వేదిక వివరాల్ని చెప్పుకొచ్చారు. నిమిషం ఉన్న ఈ వీడియోను రిచ్ గా తెరకెక్కించటమే కాదు.. ఒక భారీ బడ్జెట్ సినిమాలోని పాటకు చేసే హడావుడి ఉండటం గమనార్హం. గాలి వారి శుభలేఖ ఇప్పుడు మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. శుభలేఖే ఇలా ఉంటే.. పెళ్లి మరెంత రిచ్ గా.. క్రియేటివిటీతో ఉంటుందో..?
Full View
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News