వెలగపూడిలో హత్య కేసు... మరో 34 మంది అరెస్ట్!

తుళ్లూరు మండల పరిధిలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబర్ 27న మరియమ్మ హత్య జరిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-27 13:23 GMT

తుళ్లూరు మండల పరిధిలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబర్ 27న మరియమ్మ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.

అవును... తుళ్లూరు మండల పరిధిలోని వెలగపూడిలో జరిగిన హత్య కేసులో 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా... తాజాగా మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోపక్క.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్.. ప్రస్తుతం ఈ వెలగపూడిలోని మరియమ్మ హత్య కేసునూ ఎదుర్కొంటున్నారు.

కాగా... 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. తుళ్లూరు మండలం, వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ 2020లో నాటి వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెన్షన్ నిలివేశారని, ఇంటి స్థలం ఇవ్వలేదని ఆరోపిస్తూ జగన్ నూ దూషించారు.

దీంతో... నందిగం సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడికి ప్రయత్నించారని అంటారు. ఈ ఘర్షణల నేపథ్యంలో మరియమ్మపై దాడి జరిగిందని.. ఆ దాడిలో ఆమె మరణించిందని ఆమె కుమారుడు తుళ్లూరు పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి అప్పుడే తాను ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని అతడు చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News