రిజల్ట్ వచ్చింది... తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త!
దీనిపై సీరియస్ గా స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు... ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ గా స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు... ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో... ఈ విషయంపై చర్చ బలంగా మొదలైంది. ఇదే సమయంలో తాజాగా... తమకు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఇబ్బంది ఉందని.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇలా వరుసగా కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
అవును... గత కొన్ని రోజులుగా తెలంగాణలోని మంత్రులు, నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై కీలక ఆరోపణలు చేస్తున్న వేళ.. ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనూంతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదా? అనే ప్రశ్నకు సమాధానంగా స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు.. శ్రీవారి దర్శనానికి ఏపీ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని అన్నారు. దీంతో... తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలు తీసుకొస్తే అవి చెల్లుబాటు కావనే విషయం తెరపైకి వచ్చింది.
దీనిపై తెలంగాణ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇందులో భాగంగా... దేవస్థానంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పలు ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సమీక్ష నిర్వహించిన బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా... ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా పరిగణలోకి తీసుకోవాలని.. వారానికి రెండు సార్లు అనుమతించాలని నిర్ణయించారు. దీంతో... తెలంగాణ ప్రతినిధుల ఎఫెక్ట్ బాగానే పనిచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణలోని స్వామివారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.